sheep thief నూజివీడు: కృష్ణాజిల్లా లో వింత మోసం వెలుగు చూసింది. జిల్లాలోని విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 10 రూపాయల బజానా ఇచ్చి రూ.15 లక్షల విలువైన 135 గొర్రెలను అహరించారు దుండగులు. కేసు దర్యాప్తు అనంతరం నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. గత నెల 24వ తేదీన విస్సన్నపేట మండలం తాతకుంట్ల, చాట్రాయి మండలం, చిత్తపూరు గ్రామాలకు చెందిన ముగ్గురు గొర్రెల కాపరుల వద్ద 135 గొర్రెలను ఇద్దరు వ్యక్తులు కొనుగోలు(sheep thief) చేశారు.


డబ్బులిస్తామని నమ్మబలికి గొర్రెలతో ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విస్సన్నపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు డిఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. అయితే ఆదివారం విజయవాడ బస్టాండ్ సమీపంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.11 లక్షల 15 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులు అనంతపురం జిల్లాకు చెందిన బత్తులపల్లి మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. ఇరువురుని అరెస్టు చేసి వారి వద్ద నగదును రికవరీ చేసి కోర్టుకు తరలించినట్టు పేర్కొన్నారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!