Fleece wild sheep

Fleece wild sheep : ఆ జంతువుకు నిజంగానే విముక్తి క‌లిగింది!

Spread the love

Fleece wild sheep : పైన ఉన్న చిత్రంలో ఉన్న జంతువును గ‌మ‌నించే ఉంటారు. కొంత మందికి అది వెంట‌నే అర్థం కాక‌పోవ‌చ్చు. ఏకాగ్ర‌త‌తో చూస్తే మాత్రం క‌చ్చితంగా ఏమిటి? అనేది తెలిసిపోతుంది. తెలిసినా, తెలియ‌క‌పోయినా దాని బాధ‌ను మాత్రం ఒక్క‌సారి తెలుసుకుందాం. ఆస్ట్రేలియా దేశంలో ఉన్నికి దాని నుండి ఉత్ప‌త్తి చేస్తే వ‌స్తువుల‌కు చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతం కాస్త చ‌ల్ల‌ని ప్ర‌దేశం కాబ‌ట్టి. ఆస్ట్రేలియా దేశంలో ఒక గొర్రెకు విముక్తి క‌లిగి, స్వేచ్ఛ‌గా తిరిగే అవ‌కాశం వ‌చ్చింది. ఎప్ప‌టి నుంచి బాధ‌ప‌డుతుందో పాపం.. ఆ గొర్రె త‌న శ‌రీరంపై సుమారు 35 కేజీల ఉన్ని(బొచ్చు) తో మోయ‌లేని భారంతో జీవిస్తుంది. ఒక్క శ్వాస తీసుకోవ‌డం, ఏదైనా అతిక‌ష్టంగా మేత‌మేయ‌డం త‌ప్ప త‌న‌కు ప్ర‌పంచాన్ని పూర్తిగా, స్వేచ్ఛ‌గా త‌ల తిప్పి చూడ‌లేని ప‌రిస్థితిలో ఉంది. మొత్తంగా ఎన్ని సంవ‌త్స‌రాల నుండి త‌న శ‌రీరంపై ఉన్న ఉన్ని(బొచ్చు)తో బాధ‌ప‌డుతుందో ఆ గొర్రె తెలియ‌దు కానీ నిత్యం మూగ‌వేద‌న‌తో ప‌డుతున్న బాధ‌కు ఒక్కసారిగా విముక్తి క‌లిగింది.

ఉన్నితో ఉన్న గొర్రె – క‌త్తిరిస్తున్న దృశ్యం

35 కేజీల ఉన్ని తొల‌గించ‌డంతో గొర్రెకు విముక్తి!

బార‌క్ అనే వ్య‌క్తి అడ‌విలోకి వెళ్లిన సంద‌ర్భంలో ఈ గొర్రెను క‌నుగొన్నాడ‌ట‌. వెంట‌నే దానిని గ‌మ‌నించి అభ‌య‌ర్య‌ణం సిబ్బంది వ‌ద్ద‌కు దానిని ఒక ట్రాలీలో తీసుకొచ్చాడు. దానిని ట్రాలీలో నుండి బ‌య‌ట‌కు తీయ‌డానికి చాలా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఎలాగోలా దానిని సిబ్బంది బ‌య‌ట‌కు లాగి దానిపై ఉన్న ఉన్నిని చూసి, ఆ గొర్రె ప‌రిస్థితిని చూసి ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ఆ ఉన్నిని(బొచ్చు)ను ఆ గొర్రె శ‌రీరంపై నుండి తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు. మాములు గొర్రెల‌కు ట్రిమ్మ‌ర్‌తో ఉన్నిని చాలా సులువుగా తొల‌గిస్తుంటారు. కానీ సిబ్బందికి ఆ గొర్రెపై ఉన్న ఉన్నిని తొల‌గించ‌డానికి శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఒక ప్ర‌క్క ట్రిమ్మ‌ర్‌తో చేస్తూ, మ‌రొ ప్ర‌క్క క‌త్తితో అల్లుకుపోయిన ఉన్ని(బొచ్చు)ను తొల‌గించారు. తొల‌గించిన ఉన్ని సుమారు 35 కేజీల బ‌రువు ఉంటుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ గొర్రె త‌న శ‌రీరంపై ఉన్న భార‌మైన ఉన్నిని తొల‌గించ‌డంతో స్వాతంత్య్రం వ‌చ్చినంత ప‌ని అయ్యింది.అమ్మ‌య్య ఇక హ్యాపీగా బ‌త‌క‌వ‌చ్చు అనుకునేలా రెడీ అయ్యింది. కాక‌పోతే ఆ శ‌రీరంపై ఉన్న ఉన్ని వ‌ల్ల స‌ర్గిగా మేత మేయ‌క‌, నీర‌సంగా ఉంది. చెవులు వ‌ద్ద పుండ్లు ప‌డ్డాయి. అవి రెండు రోజుల్లో మానిపోతాయోమో గానీ ఆ గొర్రెకు విముక్తి క‌లిగింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో య్యూటూబ్‌లో వైర‌ల్ అయ్యింది. మీరు కూడా ఒక్క‌సారి చూడండి.

ఉన్నిని తొల‌గించిన అనంత‌రం గొర్రె

వీడియో కోసం లింక్‌ :Sheep Shorn of 35kg fleece after being rescued in Australia

ఇది చ‌ద‌వండి:రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన చిన్న‌మ్మ‌(శ‌శిక‌ళ)

ఇది చ‌ద‌వండి:10 life changing Principales

ఇది చ‌ద‌వండి:లోన్ల పేరుతో కొత్త త‌ర‌హా మోసం

ఇది చ‌ద‌వండి: విక్ట‌రీ ఆధ్వ‌ర్యంలో రాబోతున్న దృశ్యం 2

ఇది చ‌ద‌వండి:మ‌య‌న్మార్ లో ఆగ‌‌ని నిర‌స‌న‌లు! నిర్భంధంలోనే సూచీ!

Viral Video: బుల్లెట్ బండి సాంగ్‌ స్టాఫ్ న‌ర్స్‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు..చ‌ర్య‌లు ఏ విధంగా తీసుకుంటారంటూ స‌ర్కార్‌కు ప్ర‌శ్న‌!

Viral Video: బుల్లెట్ బండి పాట‌..ఈ ప‌దిహేను రోజుల నుండి ఓ ట్రెండింగ్ క్రియేట్ చేసింది..సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న పాట‌గా కూడా గుర్తింపు పొందింది. ఈ పాట Read more

Viral Video: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని బంకుల‌పై దాడి చేస్తున్న వన్య‌ప్రాణులు (వైర‌ల్ వీడియో)

Viral Video: Hyderabad: దేశంలో రోజు రోజుకీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు (petrol, diesel price) అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో సామాన్య జ‌నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఆగ్ర‌హం Read more

Nibba Nibbi: నిబ్బ-నిబ్బి ప‌దాల వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే!

Nibba Nibbi | తెలుగులోని హిందీలోని ఎక్కువుగా యూట్యూబ్‌లో క‌నిపించే ప‌దం నిబ్బా-నిబ్బి. ఈ ప‌దం పై youtube లో ప‌దుల సంఖ్య‌లో వీడియోలు ఉన్నాయి. అస‌లీ Read more

Amazing Street Artist: నిజంగా ఆ చేతుల‌లో ఏదో Magic ఉంది | Suriname క‌ళాకారుడి నైపుణ్యం

Amazing Street Artist | కూటి కోసం కోటి విద్య‌లు అదే విధంగా కోటి తిప్ప‌లు ప‌డాల్సి వ‌స్తుంది ప్ర‌స్తుతం స‌మాజంలో. ఉన్న‌త చ‌దువులు చ‌దివినా job Read more

Leave a Comment

Your email address will not be published.