V K Sasikala News: శశికళకు అనుమతి
ఇవ్వని ఏఐఏడింకే ప్రభుత్వం!
chennai: తమిళనాడు రాజకీయాల వైపు ఇప్పుడు దేశం ఆసక్తికరంగా చూస్తోంది. ఇటీవల శశికళ జైలు జీవితం అనుభవించి విడుదలైన సందర్భంగా తమిళనాడులో చిన్నమ్మ వర్గీయులు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే శశికళ జైలు నుంచి విడుదల వెంటనే అస్వస్థతకు గురవ్వడంతో ప్రస్తుతం బెంగుళూరులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన తమిళనాడులో అడుగు పెట్టనున్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, శశికళ స్నేహితురాలైన జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళ్లర్పిస్తారనే ప్రకటన గత కొద్ది రోజుల కిందటే తెలిసింది.
ఏఐఏడింకే ప్రభుత్వం నిరాకరణ!
శశికళ జయ సమాధి వద్దకు వెళ్లి నివాళ్లర్పించడానికి అనుమతి లేదని ఏఐఏడింకే ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమాధికి మెరుగులు దిద్ధిస్తున్నామని కాబట్టి 15 రోజుల వరకు ఎవ్వరికీ అనుమతి లేదని ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా ఎవ్వరైనా నిబంధనలను అతిక్రమించి వెళితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఏఐఏడింకే ప్రభుత్వం హెచ్చరించింది. అయితే శశికళ వర్గీయులు మాత్రం ఇది కావాలనే సందర్శనను నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో శశికళ జయసమాధి వద్దకు వెళ్లి తప్పకుండా నివాళ్లర్పిస్తారని చెబుతోంది.
మూడేళ్ల క్రితం ఫిబ్రవరి 7న ధర్మయుద్ధం పేరుతో అప్పటి డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం జయసమాధి వద్ద దీక్ష చేశారు. అదే రోజు ప్రస్తుతం శశికళ కూడా జయ సమాధిని సందర్శించుకొని తిరిగి నూతన రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో ఏం జరగబోతుందనే ఆసక్తిగా మారింది.
భారీ ఏర్పాట్లు చేస్తున్న శశికళ వర్గం!
V K Sasikala News:తమిళనాడులో శశికళ అడుగు పెట్టేందుకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఆ రాష్ట్రంలో భారీ ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. వాస్తవంగా శశికళ జైలు నుండి బయటకు వచ్చినప్పటి నుంచే తమిళనాడులో ఏఐఏడింకే ప్రభుత్వానికి శశికళ వర్గీయులకు మాధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శశికళ కారుకు ఏఐఏడింకే జెండాను పెట్టుకోవడంతో అక్కడి నుండి రాజకీయాలు మరింత వేడెక్కినట్టు తెలుస్తోంది. దీంతో ఏఐడిఎంకే అప్రమత్తమై జయ సమాధి వద్దకు ఎవ్వరికీ వెళ్లడానికి అనుమతి లేదని ప్రకటించినట్టు తెలుస్తోంది. ఒక వేళ శశికళ జయ సమాధి వద్దకు వెళితే అది ప్లస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్న శశికళకు స్వాగతం పలికేందుకు టిటివి దినకరన్ వర్గం, శశికళ వర్గం తమిళనాడులో ఏర్పాట్లను రెడీ చేశారు. ఇప్పటికే ఏఐఏడింకే కేడర్ మొత్తం శశికళ వైపే ఉందనేది కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా 7వ తేదీ అనగా ఆదివారం తమిళనాడులో శశికళ ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టడం ఖాయమనేది తెలుస్తోంది. ఇక జయసమాధి సందర్శన విషయం మాత్రం రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికరంగా మారింది.
ఇది చదవండి:నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
ఇది చదవండి:టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికల్లో జనసేనాకు టిడిపి మద్దతు!
ఇది చదవండి: ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఇది చదవండి:గుంటూరు జిల్లా కలెక్టర్గా Vivek Yadav బాధ్యతలు స్వీకరణ
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
ఇది చదవండి: 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక