Sharmila vs Kcr : దళితులపై కేసీఆర్ ప్రేమ అదే మరీ! : షర్మిల
Sharmila vs Kcr : గొర్రెలను బలిస్తారు.. కానీ సింహాలను బలివ్వరని డా.బిఆర్. అంబేద్కర్ గారు అన్నారని వైఎస్. షర్మిల అన్నారు. బుధవారం అభిమానులు, కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్. షర్మిల మాట్లాడుతూ..’అమాయకులుగా గొర్రెలుగా ఉండకండి.. సింహాలుగా గర్జించండి’ అని ముందుకు వెళుతారని అంబేద్కర్ చెప్పిన మాటలో అర్థం దాగి ఉందని తెలిపారు.
ఆత్మగౌరవానికి మించింది, విలువైనది ఏమీ లేదని అంబేద్కర్ అన్నారన్నారు. ఆత్మగౌరవం కోసం ఎందాకైనా పోరాడాలని సూచించినట్టు తెలిపారు. అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆలోచనలు సమాజంలో ఎంతో ప్రేరణ ఇచ్చాయని అన్నారు. ఆ ప్రేరణతోనే డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాలకు సమానభివృద్ధికి కృషి చేశారన్నారు. అణగారిన వర్గాలకు వీలైనంతగా సమస్తము రాజశేఖర్ రెడ్డి చేశారన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించారన్నారు. దళితుల కోసం ఎంతో పాటు పడినారని తెలిపారు.


కానీ దళితులపై ఇప్పటి పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదని షర్మిల చెప్పారు. దళితులను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నారని, వారికి ఎలాంటి సమాన న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. దళితుడుని ముఖ్యమంత్రి చెయ్యాలని ఏ దళిత బిడ్డా అడగలేదని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఓ దళితుడుని ముఖ్య మంత్రి చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. అలా మాట ఇచ్చిన కేసీఆర్ దళితులను దగా చేశారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నారని, రిజర్వేషన్ల శాతం పెంచుతానని అన్నారని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానన్నారని, చెప్పులు కుట్టేవారికి, డప్పు కొట్టే వారికి ఎంతో మందికి పెన్షన్ ఇస్తానని అన్నారని, కానీ సీఎం కేసీఆర్ వాటన్నింటినీ మరిచిపోయారని విమర్శించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ఆసియాలోనే రెండోవ అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అని అన్నారు. 16.50 లక్షల ఎకరాలను నీరందించే ప్రాజెక్టు అని షర్మిల తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ పేరు పెట్టడం ఇష్టం లేక పేరు మార్చేశారని అన్నారు. ఐదేళ్ల క్రితం డా.బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి రోజున సీఎం కేసీఆర్ ఒక మాట తెలంగాణ ప్రజలకు ఇచ్చారన్నారు. ట్యాంక్ బండ్పైన 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిస్తామని చెప్పారని అన్నారు. ఐదేళ్లు గడిచాయని ఎక్కడా కూడా అంబేద్కర్ విగ్రహం పెట్ట లేదని షర్మిల కేసీఆర్ను విమర్శించారు.


నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు మాత్రం కోవిడ్ అడ్డంకులు ఉండవని, కానీ జాతి రత్నం మైన అంబేద్కర్ జయంతి వేడుకలను చేయమంటే మాత్రం కోవిడ్ నిబంధనలు అడ్డు వస్తాయని హెద్దేవా చేశారు. అది దళితులపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ అని ఆరోపించారు. దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. గతంలో తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన రాజయ్యపై ఒక్క ఆరోపణ రాగానే ఒక్క క్షణం ఆలోచించకుండా రాజయ్యను పదవి నుండి తొలగించారన్నారు. కానీ మంత్రి మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీఎం కేసీఆర్ చెవిన పడవని విమర్శించారు. తమ సంకల్పం ఒక్కడే నని కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా రాజన్న సంక్షేమ పాలన ప్రతి ఒక్కరికీ అందాలనే ఆశయంతోనే ముందుకు వచ్చామని షర్మిల అన్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started