Sharmila New Party: దూకుడు పెంచిన షర్మిల | Sharmila new party name
Sharmila New Party:Sharmila తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టేందుకు వేగంగా సన్నహాలు చేస్తున్నారు. Sharmila new party పై రాజకీయంగా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. Sharmila new party వ్యవహారం వెనుక బీజేపీ హస్తం ఉందని విమర్శలు చేస్తున్నారు పలు రాజకీయ పార్టీ నాయకులు.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పార్టీ పెడుతున్నట్టు బహిరంగంగానే ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వైయస్సార్ అభిమానులతో ఆత్మీ సమ్మేళనంలో భాగంగా రెండ్రోజుల కిందట వైఎస్ షర్మిల నల్గొండ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ పెట్టడంపైనా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్ లో షర్మిల నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. పార్టీ పెడతామని సంచలన ప్రకటన చేసిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని, విద్యార్థుల పరిస్థితి బాగా లేదని తెలియజేశారు.
నాడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ తెలంగాణలో ఆయన పాలన తీసుకొచ్చేందుకే కొత్త పార్టీ పెడుతున్నట్టు షర్మిల ప్రకటించారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని చూసే పనిలో పడ్డారు. కొత్త పార్టీలో కొత్తవారికి, యువకులకు అవకాశం ఉంటుందని ప్రకటించారు. తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులు ఉన్నాయని, తాను ఆంధ్రప్రదేశ్ కే పరిమితమవుతారని మీడియా ఎదుట తెలిపారు.
షర్మిల పార్టీ ఏర్పాటుపై
విమర్శలు ప్రతి విమర్శలు!
Sharmila New Party: షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు టిడిపి జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేశారు.
విశ్వసనీయత గురంచి చెప్పే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కుటుంబ సభ్యులకు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జగన్ వదిలిన బాణంగా చెప్పబడిన షర్మిల తన అన్న పాలన నచ్చక పార్టీ పెట్టబోతుందని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వెన్నుపోటు గురించి చంద్రబాబే చెప్పాలని హెద్దేవా చేశారు. ఎవరు వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు అని అన్నారు. సీఎం జగన్ షర్మిలకు వెన్నుపోటు పడిచారని చెప్పిన చంద్రబాబు వెన్ను..పోటు గురించి వివరంగా చెప్పాలని తెలిపారు. షర్మిల కొత్త పార్టీ వ్యవహారం వైసీపీకి సంబంధం లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు.

షర్మిల కొత్త పార్టీ వ్యవహారం వెనుక బీజేపీ, అమిత్ షా హస్తం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అమిత్ షా చెప్పినట్టే షర్మిల నడుస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయాలు చేసినప్పుడు నోరు విప్పిన సీఎం కేసీఆర్, ఇప్పుడు షర్మిల పార్టీపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాను రాను హైదరబాద్ నగరం ఒక పొలిటికల్ టూరిజంగా మారిందని హెద్దేవా చేశారు. ఇప్పుడు షర్మిల వచ్చింది.. రేపు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ను తెలంగాణలో దింపుతాడు..తెలంగాణ రాష్ట్రమా? సమైఖ్య రాష్ట్రమా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి మళ్లీ ఆంధ్రుల పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆంధ్రుల పెత్తనం కావాలని ప్రజలు కోరుకోవడం లేదని తెలిపారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తప్పకుండా బుద్ధి చెబుతారని ఆరోపించారు.
మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగా లేదని చెప్పడంలో అవగాహన లేకపోవడమేనని షర్మిల ను విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, అది తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బాగానే ఉన్నారని, బీజేపీ కనుసన్నల్లో పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజలు ఊరుకోబోరని ఆరోపించారు.
ఇది చదవండి: ఆ చేప మహా డేంజర్! తగిలితే అంతే సంగతులు!
ఇది చదవండి: అన్నపై ఎంత అభిమానమో!
ఇది చదవండి: విషాదం: యువ జంట ఆత్మహత్యాయత్నం..యువకుడు మృతి!
ఇది చదవండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!
ఇది చదవండి:నిఘా నీడన పంచాయతీ ఎన్నికలు!
ఇది చదవండి:జగ్గయ్యపేటలో కొనసాగుతున్న పోలింగ్
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!