share market entry ఒక్క క్రికెట్ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించినప్పుడు అతడి ప్రదర్శన మీద అతడి భవిష్యత్తు ఎలా ఆధారపడి ఉంటుందో షేర్ మార్కెట్లోకి ప్రవేశించే చిన్న ఇన్వెస్టర్ కు కూడా ఇదే వర్తిస్తుంది. మొదటి సారి కొన్ని షేర్ మంచి లాభాలు ఇవ్వకపోయినా కనీసం నష్టాల బారిన పడవేయకుండా ఉంటే చిన్న ఇన్వెస్టర్ మరోసారి మార్కెట్లోకి అడుగు పెడతాడు. ఫలితం దీనికి భిన్నంగా ఉంటే షేరు మార్కెట్ అంటే భయపడతాడు. మార్కెట్ అంటేనే జూదశాల అంటూ శాపనార్థాలు పెట్టే వారి జాబితాలోకి చేరిపోతాడు. మార్కెట్ రేసులో విజేతగా నిలవడమా? పరాజయం పాలవడమా? అన్నది చాలా సందర్భాల్లో అది మీ చేతులలోనే (share market entry)ఉంటుంది.

సమయం కేటాయించగలరా?
షేర్లకు, ఇతర పెట్టుబడి సాధనాలకు ఎంతో బేధం ఉంది. షేర్లు కొనేసి కొన్నాళ్లు వాటి గురించి మరిచిపోదాం అంటే కుదరదు. మీరు కొన్న షేరు ధరలను, వాటిని ప్రభావితం చేసే పరిణామాలను ప్రతి రోజూ గమనిస్తూ ఉండాలి. అందుకే మొట్టమొదటి సారి షేర్ల కొనుగోలుకు దిగేముందు తన పెట్టుబడులను నిరంతరం పర్యవేక్షించడం కొరకు ఎంత సమయం కేటాయించగలమన్న విషయాన్ని తేల్చుకోవాలి. కనీసం వారానికి ఒక్కసారైన ధరలను గమనించకపోతే లాభాల అవకాశాలు చేజారిపోతాయి.
షేరు మార్కెట్, ఆర్థిక పరిస్థితులకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆర్థిక రంగంలో జాతీయంగా అంతర్జాతీయంగా జరిగే అనేక పరిణామాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. స్టాక్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి కనీసం షేర్ల ధరలను ప్రభావితం చేసి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆ విషయాలలో మీ గురించి మీరు సంతృప్తి చెందితే షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించవచ్చు.

మీరు తప్పకుండా సమాచార సేకరణ తప్పనిసరిగా చేయాలి. పలానా పేరు కొంటే లాభాల పంటే నంటూ ఊరించే టిప్స్కూ లోటు లేదు. వీటిని చూసిన ఇన్వెస్టర్‌కు మార్కెట్ అంటే లాభాల గనిలా అనిపిస్తుంది. లాభాలకు దారి చూపేది మీ అవగాహనా మాత్రమేనని తెలుసుకోవాలి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి