shankaracharya philosophy | పరమాత్మను గనుక తెలుసుకోకపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయే. ఆయనను గనుక తెలుసు కొంటే ఇక శాస్త్రాలన్నీ వృధాయే. భవబంధాల నుంచి విముక్తి పొందాలంటే మనిషి తానైనదానికీ, తానుకానిదానికీ మధ్య తేడాను అభ్యాసం చేయాలి. అప్పుడు మాత్రమే అతడు సత్యాన్ని తెలుసు కోగలుగుతాడు. చీకటి, అది కల్పించే భ్రమలూ అవన్నీ కూడా సూర్యుడు రానంత వరకే. సూర్యుడు వచ్చాక అవన్నీ మటుమాయం కావాల్సిందే కదా! అలాగే ఆత్మసాక్షాత్కారం కానంత వరకే ఈ మాయ పొరలన్నీనూ.
shankaracharya philosophy
నీవు కానిదాని గురించి ఆలోచించకు. అది నిన్ను కృంగదీస్తుంది. బాధ కలిగిస్తుంది.దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు. అది నిన్ను అన్నింటి నుంచీ విముక్తుడిని చేస్తుంది. మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది. లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది. సంపదల వెంట పరుగుల పెట్టకు. ఎందుకంటే సంపద మనిషిని పతనం చేస్తుంది. సంపద గల మనిషి తన స్వంత కుమారులకు కూడా భయపడతాడు. ఇదీ సంపద వల్ల వచ్చే ఫలితం.
సూర్యుడి నుంచి వచ్చే వేడి నుంచి చంద్రుడు భూమిని కాపాడుతున్నట్టుగా, మహాత్ములు ఎల్లప్పుడూ బాధల్లో ఉన్నవాళ్లకి సహాయం చేస్తుంటారన్నమాట. నిర్గుణ సమాధి ద్వారా మనిషి తన హృదయంలో ఉన్న అజ్ఞాన ముడిని విప్పివేసుకొంటాడు. బంగారాన్ని మండుతున్న కొలిమిలో గనుక పెడితే ఎలాగైతే దానిలోని మాలిన్యాలన్నీ పోతాయో అలాగే మనిషి కూడా ధ్యానమగ్నుడైతే పరిశుద్ధడౌతాడు. ఇంద్రియనిగ్రహంతో వైరాగ్యభావం గల మనిషిలో ఉన్న శాంతినీ, సంతోషాన్నీ ఎవరు పోగొట్టగలరు?. శ్వాసమీదనే ధ్యాస పెట్టుకొని ధ్యానమగ్నుడైన వాడికి అన్నీ ఉన్నట్లే.

అజ్ఞానమే అన్ని బంధాలకూ ఆదిమూలం. అది పోతే దానితోపాటూ వచ్చిన అన్ని బంధాలూ పటాపంచ లవుతాయి. తామరాకుమీది నీటి బిందువు ఎలాగైతే నిలకడగా ఉండదో అలాగే ఈ జీవితం కూడా నిలకడగా ఉండదు. చలికి వణికిపోతున్నా, వయసు మీద పడిపోతున్నా, తినడానికి తిండిలేక పోయినా, కప్పుకోవడానికి బట్టలేకపోయినా, తలదాచు కోవడానికి గూడులేకపోయినా, శరీరం పట్టుతప్పిపోయినా, చేతిలో చిల్లిగవ్వలేక పోయినా, చివరికి బిచ్చమెత్తుకొని బతుకుతున్నా కూడా ఆశామోహాలను మాత్రం వదులుకోవడానికి సుతరామూ ప్రయత్నించడుగాక ప్రయత్నించడు. ఇందియాలు సహకరిస్తే సుఖం. అవి సహకరించకపోతే దుఃఖం. కాబట్టి సుఖదుఃఖాలు రెండూ కూడా శాశ్వతమైనవి కాదని తెలుసుకొంటే మంచిది.
తల్లిదండ్రులను మరువ వద్దు!
అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువ వద్దు. వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ ఉండరని తెలుసుకో. నువ్వు పుట్టాలని రాళ్లకు పూజలు చేవారు వారు. రాయివై వారి హృదయాలను వ్రక్కలు చేయవద్దు. కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు. నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు. ముద్దు మురిపాలుతో నీ కోర్కెలు తీర్చారు వారు. ఆ ప్రేమ మూర్తుల కోరికలను నీవు నెరవేరచాలని మరువవద్దు. నెవ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా? అంతా వ్యర్థమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు. సంతానం వల్ల సుఖం కోరుతావు.
నీ సంతాన ధర్మం మరువవద్దు. ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు. నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు. అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో ఆశ్రవులను నింపుకు. నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు. ఆ మార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని బాధించకూడదు. డబ్బు పోతే మళ్లీ సపాదించవచ్చు. తల్లిదండ్రులను మాత్రం మళ్లీ సంపాదించలేవు. వారి పాదాల గొప్పదనం జీవితాంతం మరువవద్దు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!