Shanghai covid reports | చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఆదివారం ఒక్కరోజై షాంఘైలో 22,000 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. తొలిసారిగా వైరస్‌తో ఇద్దరు మృతి(Shanghai covid reports) చెందారు. మార్చి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు షాంఘైలో 3 లక్షల 20 వేల కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. కఠిన లాక్డౌన్ కారణంగా 25 మిలియన్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు.
విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
ఈ క్రమంలో హాంకాంగ్(Hong Kong)లో కరోనా టెన్షన్ మొదలైంది. అక్కడి అధికారులు ప్రజలపై పలు ఆంక్షలు విధించారు. తాజాగా ఆ దేశ అధికారులు విధించిన కోవిడ్-19(covid-19) పరిమితులు, పరిమిత డిమాండ్ల కారణంగా ఎయిర్ ఇండియా హాంకాంగ్‌కు విమాన సేవలను రద్దు చేసినట్టు విమానయాన సంస్థ తెలిసింది. హాంకాంగ్ అధికారులు విధించిన ఆంక్షలు తీవ్రతరం కాగా, ఏప్రిల్ 19 మరియు ఏప్రిల్ 23 తేదీలలో విమానాలు రద్దు చేయబడ్డాయని ఎయిర్ ఇండియా(Air India) తెలిపింది. ఈ విషయాన్ని ఎయిర్‌లైన్ తన అధికారిక ట్విట్టర్లో ధృవీకరించింది. హాంకాంగ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం చైనాలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా హాంకాంగ్ ఉంది. ఈ క్రమంలో హాంకాంగ్‌లో కోవిడ్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. అయితే భారత్ నుంచి హాంకాంగ్‌కు విమాన ప్రయాణం చేయవచ్చని, కాకపోతే 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి ఇస్తామని ఆ దేశ అధికారులు తెలిపారు. ప్రస్తుతం హాంకాంగ్ తో భారత్‌తో సహా 8 దేశాల నుంచి ఇన్ కమింగ్ విమానాలపై రెండు వారాలపాటు నిషేధాన్ని ప్రకటించింది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!