Shaik Rasheed (vice-captain) | భారత అండర్ -19 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నిని తన తండ్రితో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. భారత దేశం అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ షేక్ రషీద్(Shaik Rasheed vice-captain) ను ఎస్పీ హృదయ పూర్వకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్ది సేపు ఇరువురు ముచ్చటించారు. క్రికెట్ కెరియర్లో తాను పడిన కష్టం గురించి రషీద్‌ను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ సాధించాలనే పట్టుదల, ధృడ సంకల్పం మనలో ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని క్రికెటర్ రషీద్(Cricketer Rasheed) నిరూపించాడని అన్నారు. రషీద్ ఈ స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులు త్యాగం ఇంకా గొప్పదని వారిని కొనియాడారు. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఎదుర్కొని నిలబడిన వారికే విజయం సొంతం అవుతుందని పేర్కొన్నారు.అందుకు క్రికెటర్ రషీద్ ఉదాహరణ అని అభిప్రాయం చెప్పారు.
అనంతరం ఎస్పీ క్రికెట్ బ్యాట్‌పై ఒక సంతకం చేయమని రషీద్‌ను అడుగగా వెంటనే తన ఆటోగ్రాఫ్‌ను సంతోషంగా ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా రషీద్‌తో ఫొటో దిగి జీవితంలో మరెన్నో విజయాలను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!