Nimmakayala Sriranganath హైదరాబాద్: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు నిమ్మకాయల శ్రీరంగనాధ్ మంగళవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 80 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి మండ లంలో జన్మించారు. మునిపల్లెలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి కాకినాడలో ఉన్నత విద్యను చదివారు. వామపక్ష రాజకీయాల ప్రభావంతో జర్నలిజంలోకి వచ్చిన తర్వాత ఉదయం, వార్త, ఆంధ్రప్రభలో వివిధ హోదాలలో(Nimmakayala Sriranganath) పనిచేశారు.
ఏపీ టైమ్స్ ఇంగ్లీషు దినపత్రికకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ గా వ్యవహరించారు. నిమ్మకాయల శ్రీరంగనాధ్ కు భార్య లక్ష్మీకాంతం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కుమారుడైన నిమ్మకాయల వంశీ ప్రస్తుతం డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. రంగనాథ్ అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల పలువురు అధికార, అనధికార ప్రముఖులు, జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!