selfie video viral

selfie video viral: 20 నిమిషాల్లో న‌లుగురి ప్రాణాలు కాపాడిన క‌డ‌ప జిల్లా పోలీసులు

Spread the love

selfie video viral క‌డ‌ప: భూ త‌గాదా విష‌యంలో ఓ వ‌ర్గానికి కొమ్ము కాస్తున్న‌ట్టు మైదుకూరు రూర‌ల్ సీ.ఐ పై ఫిర్యాదు చేసిన అక్బ‌ర్ భాషా కుటుంబం అనంత‌రం సిఐ త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఆవేద‌న‌తో తాము కుటుంబంలో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో లైవ్ వీడియో పెట్ట‌డంతో అది కాస్త(selfie video viral) వైర‌ల్ అయ్యింది.

ఉన్న‌తాధికారులు ఆదేశాల మేర‌కు వెంట‌నే రంగంలోకి దిగిన దువ్వూరు ఎస్ఐ చాల‌మ‌ర్రి పోలీస్ స్టేష‌న్ సిబ్బందితో క‌లిసి కేవ‌లం 20 నిమిషాల్లో చాగ‌ల‌మ‌ర్రిలో నివాసం ఉండే ఫిర్యాదు దారుడు మిద్దె అక్బ‌ర్ భాషా ఇంటికి చేరుకున్నారు. అత‌డితో మాట్లాడి జిల్లా ఎస్పీ వ‌ద్ద‌కు తీసుకెళ‌తామ‌ని చెప్ప‌డంతో అక్బ‌ర్‌, అత‌ని కుటుంబ స‌భ్యులు శాంతించారు.

శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు జిల్లా ఎస్పీ కె.ఎన్ అన్భురాజ‌న్ ను జిల్లా కార్యాల‌యంలో క‌లిశారు. త‌క్ష‌ణ‌మే స్పందించి త‌మ‌కు న్యాయం చేస్తామ‌ని భ‌రోసా ఇవ్వ‌డంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం విర‌మించుకుంటున్నామ‌ని అక్బ‌ర్ తెలిపారు.

సిఐపై ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌

ఎస్పీ అన్బురాజ‌న్ ఆదేశాల మేర‌కు మైదుక‌రు రూర‌ల్ సిఐ పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణాధికారిగా ఎస్పీ దేవ ప్ర‌సాద్‌ను నియ‌మించిన‌ట్టు తెలిపారు. విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కూ మైదుకూరు రూర‌ల్ సిఐని విధుల నుండి త‌ప్పిస్తున్న‌ట్టు ఎస్పీ తెలిపారు. విచార‌ణ‌లో వెల్ల‌డ‌య్యే అంశాల ఆధారంగా త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ఎస్పీ పేర్కొన్నారు.

ఆత్మ‌హ‌త్య ప‌రిష్కారం కాదు :ఎస్పీ

ఆత్మ‌హ‌త్యాయ‌త్నం అనేది దేనికీ ప‌రిష్కారం కాద‌ని ఎస్పీ అన్బురాజ‌న్ పేర్కొన్నారు. ఆత్మ‌హ‌త్య‌తో మిమ్మ‌ల్ని న‌మ్ముకున్న కుటుంబాన్ని ఆవేద‌న‌కు గురిచేయ‌డం భావ్యం కాద‌న్నారు. ఎలాంటి స‌మ‌స్య‌లున్నా త‌న దృష్టికి తెస్తే ప‌రిష్క‌రిస్తామ‌ని, డియ‌ల్ 100 లేదా త‌న ఫోన్ నెంబ‌ర్ 9440796900 కు ఫోన్ చేసి త‌న దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రిస్తామ‌ని ఎస్పీ పోలీసు శాఖ త‌ర‌పున భ‌రోసా ఇచ్చారు. అనంత‌రం త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగి కేవ‌లం 20 నిమిషాల్లో స‌మ‌య‌స్ఫూర్తితో కుటుంబంలోని న‌లుగురి ప్రాణాలు కాపాడిన దువ్వూరు ఎస్ఐ కె.సి రాజు, క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ సి.ఐ ఎన్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వారి సిబ్బంది చాగ‌ల‌మ‌ర్రి కానిస్టేబుల్ కె. వెంక‌టేశ్వ‌ర్లు, హోంగార్డు మ‌హ‌మ్మ‌ద్ ర‌ఫీల‌ను శ‌నివారం జిల్లా పోలీసు కార్యాల‌యంలో రివార్డులు అంద‌జేశారు. న‌లుగురు నిండు ప్రాణాల‌ను కాపాడ‌టం అభినంద‌నీయ‌మ‌ని, పోలీసు శాఖ ఔన్న‌త్యాన్ని మ‌రోమారు చాటార‌ని జిల్లా ఎస్పీ తెలిపారు.

driver love affair: మంత్రి కూతురితో ప్రేమాయాణం ప్రాణ‌హాని ఉంద‌ని డ్రైవ‌ర్ సెల్పీ వీడియో!

driver love affair: చెన్నై: ఇడియ‌ట్ సినిమా అంద‌రికీ గుర్తుంది క‌దా! అందులో ఒక డైలాగ్ ఉంటుంది. క‌మీష‌న‌ర్ కూతుళ్ల‌కు మొగుళ్లు రారా అని హీరో ర‌వితేజ Read more

CBI Investigation: వివేకా హ‌త్య కేసులో తాజా స‌మాచారం 83వ రోజుకు..

CBI Investigation: వైఎస్‌. వివేకానంద రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి సీబీఐ విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. వివేకా మృత‌దేహానికి పోస్టుమార్గం చేసిన డాక్ట‌ర్ నివేదిక‌ను మ‌రోసారి సీబీఐ Read more

Ys Sunitha Reddy: వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు నివాసం వ‌ద్ద రెక్కీ…ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఎస్పీకి ఫిర్యాదు

Ys Sunitha Reddy: క‌డ‌ప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో భాగంగా 68వ రోజు సీబీఐ విచార‌ణ కొన‌సాగించింది.క‌డ‌ప జిల్లా పులివెందుల ఆర్ అండ్ Read more

YS Vivekanada Murder case: వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఇద్ద‌రు ప్ర‌ముఖుల హ‌స్తం?

YS Vivekanada Murder case: పులివెందుల: ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాబాయ్ వైఎస్‌.వివేకానంద రెడ్డి మ‌ర్డ‌ర్ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు దీర్ఘ‌కాలికంగా Read more

Leave a Comment

Your email address will not be published.