Self-Confidence Improvement Techniques | ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నా, ఏ పనినైనా విజయవంతంగా ముగించాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. మాటలోనే కాదు నడకలోనూ ఆత్మవిశ్వాసం(Self-Confidence) కొట్టొచ్చినట్టు కనిపించాలి. అప్పుడే మనం వేసే ప్రతి అడుగూ విజయం దిశగా నడిపిస్తుంది. అయితే ఆత్మవిశ్వాసం పెంచుకునే మంత్రదండం ఎక్కడో కాదు మన ఆలోచనల్లోనే ఉంది. అదెలాగంటే?
Self-Confidence Improvement Techniques: ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలంటే!
Body Language Skills: సరైన భంగిమలో నిల్చోవడం ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు(Improvement Techniques) చేస్తుంది. దానివల్ల మీకు ఎన్నో అనుకూలతలు ఉంటాయి. మీరు లోపల ఏం అనుకుంటారో బయటకు అలానే కనిపిస్తారని చెబుతున్నారు నిపుణులు. నిటారుగా నిల్చోవడం ద్వారా, కుర్చీలో వెన్నెముఖ నిటారుగా ఉంచి కూర్చో వడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మిమ్మల్ని చూసిన వారు మీరు చేసే పని పట్ల స్పష్టత ఉన్నదని భావిస్తారు. అలా కాకుండా డీలా పడినట్టు , కూలబడినట్టు కూర్చున్నారంటే మీరు ఆత్మవిశ్వాసంగా లేరని అర్థమవుతుంది.

Winning list: మీరు గతంలో దాటి వచ్చిన కష్టాల జాబితా రాసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఆలోచనల్లో మార్పు వచ్చి దృఢంగా మారుతారు. భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలను గట్టెక్కేందుకు కావాల్సిన మానసిక ధైర్యం పోగవుతుంది.
Leave Fear: మీరు భయపడి చేయకుండా వదిలేసిన పనుల్ని చేయండి. అలా చేస్తేనే వాటిపట్ల మీలోని భయం పోతుంది. ఎందుకంటే భయంతో ఆ పని చేయలేక పోయానని తరువాత బాధపడేకన్నా ఇప్పుడే ధైర్యంతో చేయడం మంచిది. కొత్త సవాళ్లను స్వీకరించడం ద్వారా మీ మెదడుకు మీకు అవసరమైనంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే పనిలో ఉంటుంది.
psychology mind: మానసికంగా దృఢంగా ఉండాలంటే!
కొంత మంది చిన్న విషయాలకే కుంగిపోతారు. ఇంకొంత మంది పక్కలో బాంబు పడ్డా తొణకరు, బెణకరు. అడ్డంకులొస్తే అధిగమిస్తారు. సమస్యలొస్తే పరిష్కరిస్తారు. అంతేగాని బీరువల్లే పారిపోరు. మానసిక దౌర్భల్యాన్ని వదలించుకుని జీవితాన్ని గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ వ్యవహారశైలిని అనుసరించాలి. అదెలాగంటే!
Don’t Stop: జరిగినదానికి పశ్చాత్తాపపడుతూ, స్వనిందకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి కష్టాలు, నష్టాలు అశాశ్వతాలనే విషయాన్ని గ్రహించి జీవితంలో ముందుకు సాగాలి.
change life: మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకూ కష్టమే! ఎదుటి వారికీ కష్టమే. కాబట్టి మార్పును ఆహ్వానించండి, ఆస్వాదించండి.
సవాళ్లను అంచనా: Risk లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుంది. అలాగని ఎలాంటి ఎత్తుడలు, ప్రణాళికలు లేకుండా సవాళ్లను స్వీకరించడం తప్పు. కాబట్టి సవాళ్ల బరువు తూచి, లాభనష్టాలు అంచనా వేసి ముందడుగు వేయాలి.
అపజయాల్ని గెలవాలి: గెలుపోటములు సహజం. ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపెలా సాధ్యమవుతుంది. ఓడినచోటే నెగ్గాలి. కాబట్టి తిరిగి గెలవడం కోసం ఓటమిని అంగీకరించాలి.

Self-Confidence Improvement Techniques: ఒత్తిడిని జయించండిలా!
ఒత్తిడిని జయించాలంటే ముందుగా కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి. చిన్న పనులతో ఎప్పుడూ బిజీగా ఉండాలి. అప్పుడే మానసికంగా సేద తీరవచ్చు. అందుకే పెద్ద హోదాలో ఉన్నవారు కూడా తమ అలవాట్లు, పనులను వదులుకోరు. ఒత్తిడిగా ఉన్నప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కావాలంటే కొంత సేపు సమయం తీసుకుని నిదానంగా ఆలోచించి వ్యవహరించాలి. లేదంటే దిద్దుకోలేనంత తప్పు పైన పడుతుంది.
రోజువారి పనుల్లో ఆందోళనలు పెట్టుకోకూడదు. ఒకటే ఆలోచన వెంటపడి తరుము తుంటే దాని నుంచి డైవర్షన్ తీసుకోవాలి. పరాజయం ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. పదే పదే దాన్ని తలుచుకోవడం మంచిది కాదు. కొన్ని విషయాలే మనచేతిలో ఉంటాయి. మరికొన్ని మన చేతుల్లో ఉండవనే జీవన సత్యాన్ని గ్రహించాలి. శారీరక వ్యాయామం కూడా చాలా అవసరం. ఎప్పుడూ ఒకే చోట కూర్చొని పని చేయకూడదు. అప్పుడప్పుడు స్థలం మారుస్తూ ఉండాలి. అప్పుడే కొత్త ఆలోచనలు, పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఒకే దగ్గర కూర్చొని పని చేయడం వల్ల మెదడు మొద్దు బారిపోతుంది. తేలికపాటి వ్యాయామాలతో రక్త ప్రసరణ వేగవంతమవుతుంది.