Selayeru Paduthunte lyrics 2022:సెల‌యేళ్లు పారుతుంటే ఓ పిల్ల లిరిక్స్‌

Selayeru Paduthunte lyrics 2022: ఒక ప్రైవేటు సాంగ్ ఇంత‌లా ఆక‌ట్టుకోవ‌డం ఈ కాలంలో ఇదే తొలిసారి కావ‌చ్చు. పాట‌కు బానిసై వంద‌ల సార్లు విన్న‌వారు చాలా మంది ఉన్నారు. ఇంత‌కీ ఆ పాట ఏమిటంటే సెల‌యేరు పారుతుంటే..డిజెశివ వంగూర్ యూట్యూబ్ లో నుండి విడుద‌లైన‌ది.

ఈ ఏడాది 2022 జులై 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సెల‌యేరు పారుతుంటే పాట యూట్యూబ్‌లో, సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎంత‌లా అంటే పాట టీజ‌ర్ చూసిన వారంతా పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి అంటూ ఎదురు చూసిన క్ష‌ణాలు కొక్కొల్లాలు. సెల‌యేరు పారుతుంటే పాట టీజ‌ర్ మిలియ‌న్స్ వ్యూస్ రావ‌డం గ‌మ‌నిస్తే ఆ పాట ఎంత‌లా ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆక‌ట్టుకుందో అర్థ‌మ‌వుతుంది.

మ‌త్తుకు బానిస అవుతార‌ని తెలుసు కానీ మొద‌టిసారి పాట‌కు బానిస‌య్యాను. ఎన్నిసార్లు విన్నాకూడా మ‌ల్లీ మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంద‌ని ఓ ప్రేక్ష‌కుడు కామెంట్ పెట్టాడు. ఇలా చాలా మంది పాట విన్న‌వారు, వీడియో చూసిన వారు త‌మదైన శైలిలో అభినందిస్తూ పాట‌ను పొగిడారు. పాట‌లో ప్ర‌తి ప‌దం ప్రేక్ష‌కుడి మ‌న‌సు దోచింది. ఇంకా ఇందులో న‌టించిన శివ‌, సాయిశ్రావ‌ణి న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. పాట‌ను కేవ‌లం వారి న‌ట‌న కోసం, హీరోయిన్ కోసం చూసేవారు చాలా మంది ఉన్నారు.

సాయిశ్రావ‌ణి

Selayeru Paduthunte lyrics 2022 పాట‌ను కోన‌సీమ‌లో సెట్ చేశారు. అక్క‌డ ప‌ల్లె వాతావ‌ర‌ణంలో ఎలాంటి డిజెలు, మూజ్యిక్ మిక్సింగ్ లేకుండా చాలా ఆహ్లాద‌క‌రంగా పాట‌ను తెర‌కెక్కించారు. పాట రూపం దాల్చ‌దానికి మ‌హేంద‌ర్ ముల‌క‌ల కీల‌కం. పాట రాసినంద‌కు మ‌హేంద‌ర్‌ను పొగ‌డ‌ని వారు లేరు. ఇక కాన్సెప్ట్‌, స్క్రీన్ ఫ్లే, డైరెక్ష‌న్ అంతా డిజె శివ‌ది. అత‌ను మ‌న‌సు పెట్టి తెర‌కెక్కించి ఈ పాట జాన‌ప‌ద పాట‌ల రంగంలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోతుంది. ఇక సంగీతం క‌ళ్యాన్ కీస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. పాట‌కు ప్రాణం సంగీతం అని చెప్ప‌వ‌చ్చు.

Selayeru Paduthunte lyrics 2022: సెల‌యేళ్లు పారుతుంటే ఓ పిల్ల లిరిక్స్‌

సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల
ఎదగూళ్ళుగుతుండే లోలోన
నదులన్నీ కలిసినట్టు ఓ పిలగ
నవ్వెంత బాగున్నదీ నీలోన

గాజుల సప్పుల్లు ఘల్ ఘల్ మోగంగా
గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా
వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల
వయ్యారి నడుమూపవే ఈ వేళ

సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా
ముద్ద మందారాలు పలుకుతున్నట్టుగా
మాయా మాటలు పలుకకు ఓ పిలగా
మా అన్నలొస్తున్నరు తోవల్ల

సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల
ఎదగూళ్ళుగుతుండే లోలోన

పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల
పాలొంచి వంగినయ్యి సేనంత
రామసిలకల సూపులూ చాలింక
రత్నాల బొమ్మనైతి మా ఇంట

పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల
పాలొంచి వంగినయ్యి సేనంత
రామసిలకల సూపులూ చాలింక
రత్నాల బొమ్మనైతి మా ఇంట

వెయ్యంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు
దీపాల కాంతుల్లో దరిచేరు నా వైపు
జోడెడ్ల బండి కట్టీ ఓ పిల్ల
జోరుగ ఎక్కిస్తనే ఈ వేళ

ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి
మదిలోన పూసింది మందార సిరిమల్లి
మరుగు మాటల వాడివే ఓ బావ
మా వదినలొస్తున్నరు తోవల్ల

బాయిగడ్డన పూసినై ఓ పిల్ల
బంగారు కుసుమ పూలు నిండుగా
పూసిన పున్నమోలే నేనున్న
బంగారు బొమలెందుకోయ్ నాకింకా

బాయిగడ్డన పూసినై ఓ పిల్ల
బంగారు కుసుమ పూలు నిండుగా
పూసిన పున్నమోలే నేనున్న
బంగారు బొమలెందుకోయ్ నాకింకా

కారెండ పడవీలో కస్తూరి రంగాయే
వెండీ కొండలమీన వెలుగన్న లేదాయే
నెమలి కన్నుల దానివే ఓ పిల్ల
నెలవంక తీరున్నవే ఈ వేళ

నల్ల కలువల మీద నాటు తుమ్మెదవోలే
అడవి మల్లెలమీద ఆ చంద్రవంకోలే
కొంటే చూపుల వాడివే ఓ బావ
కోడళ్ళు వస్తున్నరు తోవల్ల

పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల
పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
సింగిడి రంగులల్లా పూసేటి
సిరి జొన్నకంకినైతి తోటల్లా

పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల
పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
సింగిడి రంగులల్లా పూసేటి
సిరి జొన్నకంకినైతి తోటల్లా

చినుకమ్మ మెరుపమ్మ చినబోయినట్టుంది
చలిమంట గిలిమంట ఎదలోన రగిలింది
చిలుక గోరింకవోలే కూడుండి
చితి మీద తోడొస్తనే ఓ పిల్ల

పాల ముత్యాలన్ని పరువాలు పలుకంగా
పండు వెన్నెల వచ్చి పందిళ్లు వేయంగా
మొగిలి పువ్వుల వాడివే ఓ బావ
మనువాడి కలిసుంటనే నీ తోడ
మొగిలి పువ్వుల వాడివే ఓ బావ
మనువాడి కలిసుంటనే నీ తోడ…..

సాయిశ్రావ‌ణి

Selayeru Paduthunte lyrics 2022 | 𝐌𝐔𝐒𝐈𝐂 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :

Song: Selayellu
Lyrics : Mahender Mulkala
Music Director : Kalyan Keys
Singers : Djshiva Vangoor, Srinidhi

𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐓𝐈𝐎𝐍 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :

Concept Screenplay & Direction : Djshiva Vangoor’s
Producer : Djshiva Vangoor
Dop : Kamli Patel
Editing & DI : Djshiva Studios HYD
Drone : Suresh Munna
Dubbing Studio: Raaju HYD
Choreographer : Alex
Cast : Djshiva Vangoor & Saisharvani
Production Manager : Nenu Mee Bharath
Make up & Hair : Raju Thimmappa
Posters: Rana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *