Banned Substances

Banned Substances : బెంగుళూరు టు గుంటూరు నిషేధిత ప‌దార్థాల గుట్టు ర‌ట్టు!

Spread the love

Banned Substances : గుంటూరులో పెద్ద ఎత్తున నిషేధిత ప‌దార్థాల‌ను పోలీసులు గుట్టు ర‌ట్టు చేశారు. బెంగూళూరు నుంచి గుంటూరుతో పాటు 8 రాష్ట్రాల‌కు ర‌వాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన‌ట్టు గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.


Banned Substances : గుంటూరు : గుంటూరులో గుట్కా, న‌కిలీ సిగిరేట్‌, ఖైనీ స్థావ‌రాల‌పై సోమ‌వారం దాడులు చేసిన‌ట్టు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. ఈ దాడుల్లో రూ.97 ల‌క్ష‌ల విలువ గ‌ల నిషేధిత ప‌దార్థాలు ల‌భ్య‌మైన‌ట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని తెలిపారు. గుట్కా, నిషేధిత సిగిరెట్ స‌ర‌ఫ‌రా చేసే ప్ర‌ధాన నిందితుడు బెంగుళూరుకు చెందిన సిద్ధుగా గుర్తించామ‌న్నారు. ప్ర‌ధాన నిందితుడు సిద్ధు 8 జిల్లాల‌కు గుట్కా స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్టు తెలిసింద‌న్నారు. ప్ర‌తి జిల్లాకు ఇద్ద‌రు చొప్పున గుట్కా స‌ర‌ఫ‌రా చేసేందుకు ప‌నిచేస్తున్నార‌ని తేలింద‌న్నారు.

ఈ గుట్కా రాకెట్‌ను చేధించ‌డానికి రెండు పోలీసు బృందాలు ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాయ‌ని ఎస్పీ అన్నారు. గుట్కా త‌ర‌లింపుపై పోలీసులు దృష్టి సారిస్తే నిందితులు ఆర్‌టిజిఎస్ ద్వారా న‌గ‌దును పంపి వివిధ కంపెనీ పేర్ల‌తో పార్శిల్ ద్వారా త‌మ ప‌ని కానిచ్చేస్తున్నార‌న్నారు. గుట్కాను బెంగుళూరుకు చెందిన సుబ్ర‌మ‌ణ్యం ఎంట‌ర్ ప్రైజెస్ ద్వారా స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని అన్నారు. త్వ‌ర‌లో గుట్కాకు సంబంధించి ప్ర‌ధాన నిందితులు వాటికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ఎస్పీ విశాల్ గున్నీ విలేక‌ర్ల తెలిపారు.

ATM card change: ముస‌లివారిని టార్గెట్ ..ఏటీఎంలో డ‌బ్బులు మాయం!

ATM card change గుంటూరు: అత‌ను ఏటిఎం వ‌ద్ద‌నే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఎవ‌రు ఏటిఎంలోకి వెళితే వారి వెనుకాలే ఉంటాడు. ఏటిఎంలో డ‌బ్బులు తీయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి మాట‌ల్లో Read more

fake currency:దారి బాట‌లో న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట!

fake currencyవినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈపూరు మండ‌లంలోని న‌కిలీ క‌రెన్సీ వెలుగు చూసింది. ఓ రైతు పొలంకు వెళుతుండ‌గా క‌వ‌ర్లో న‌కిలీ క‌రెన్సీ ఉండ‌టాన్ని Read more

state bank of india: కోటి స్వాహా అంట‌? స్టేట్ బ్యాంక్ లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన భారీ స్కాం?

state bank of indiaగుంటూరు: జిల్లాలోని కారంపూడి మండ‌లంలోని కారంపూడి గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ లో భారీగా స్కాం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. న‌కిలీ బంగారం తాక‌ట్టు, Read more

Guntur news: గుంటూరులో ఘ‌రానా మోసం పెళ్లి పేరుతో కోటి స్వాహా!

Guntur news గుంటూరు: social media లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వ‌ల‌వేసిన స‌త్తెన‌ప‌ల్లి కి చెందిన దంప‌తులు అత‌ని వ‌ద్ద నుంచి పెళ్లి పేరుతో కోటి Read more

Leave a Comment

Your email address will not be published.