Secunderabad club history హైదరాబాద్: అందమైన కట్టడం అంతకు మించి చారిత్రక నిర్మాణం, అగ్గికీలలకు ఆహుతైపోయింది. 150 ఏళ్లు గడిచినా చెక్కు చెదరని సికింద్రాబాద్ క్లబ్ అనుకోని అగ్ని ప్రమాదంలో తగలబడిపోవడం సంచలనం రేపుతోంది. క్లబ్ మంటల్లో కాలిపోవడం వెనుక కారణలేమిటి? పోలీసులు చెబుతున్నదేంటి? నిర్వాహకుల తీరు ఎలా ఉంది?

అగ్ని ఆహుతైన సికింద్రాబాద్ క్లబ్
ఆదివారం తెల్లవారుజాము మూడు గంటలకు ముందు సికింద్రాబాద్ క్లబ్(Secunderabad club history) చూడ మూచ్చటగా ఉంది. అందమైన స్ట్రక్చర్‌తో లోపల అంతకు మించిన ఇంటీరియర్‌తో అందర్నీ ఆకట్టుకునేది. ఒకే ఒక్క రాత్రిలో అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి నెలకొంది. తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బడబాగ్నిలా మారి క్లబ్ మొత్తం వ్యాపించాయి. దీంతో దాదాపు క్లబ్ మొత్తం బూడిదైపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటాల్పేందుకు రంగంలోకి దిగారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిలిన్నట్టు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.
సికింద్రాబాద్ క్లబ్ చరిత్ర
ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ క్లబ్ ఈ నాటిది కాదు. బ్రిటీష్ కాలంలో నిర్మితమైనది. 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ 18వ శతాబ్దంలో అత్యద్భుతంగా దీన్ని నిర్మించారు. క్లబ్ నిర్మాణం కోసం అప్పట్లోనే చాలా ఖరీదైన కలప మెటీరియల్‌ని, ఇతర సామాగ్రిని విదేశాల నుంచి తెప్పించినట్టు క్లబ్ గురించి తెలిసిన వారు అంటున్నారు. అందుకు తగ్గట్టే గ్రాండ్‌గా ఉంటుందీ క్లబ్. ఈ క్లబ్లో 5 వేల మంది మెంబర్స్ ఉన్నారు.

క్లబ్ మెంబర్ కావాలంటే అంత ఈజీ కాదు
ఈ సికింద్రాబాద్ క్లబ్లో మెంబర్ కావాలంటే అంత ఆషామాషీ కాదు. ఈ క్లబ్లో మెంబర్ షిప్ తీసుకోవాలంటే అక్షరాల రూ.15 లక్షల రూపాయలు రొక్కం కట్టాల్సిందే. అందులోనూ కేవలం మిలట్రీ రిటైర్డ్ కల్నల్, రిటైర్డ్ జనరల్ మేజర్స్కి అనుమతి ఉంటుంది. అయితే పవర్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని సికింద్రాబాద్ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు. రాత్రి సమయంలో కరెంట్ వచ్చీ పోతుండటం వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు భావిస్తున్నారు. కలప ఎక్కువగా వాడిన కట్టడం కావడంతో త్వరగా కాలిపోయిందంటున్నారు. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మరలా తిరిగి కట్టిస్తామంటున్నారు.
ప్రమాదానికి కారణాలేమిటి?
అసలు సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదానికి కారణాలేమిటి? మంటలు ఎక్కడణ్నుంచి ఎగిసిపడ్డాయి? ప్రమాదం జరిగినప్పుడు అక్కడెవరైనా ఉన్నారా? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పురాతనమైన కట్టడం మంటలో కాలిపోవడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!