Section 448 | కొన్ని సార్లు మన ఇంటిని ఆక్రమించుకోవడానికి(House Trespass) దౌర్జన్యంగా బంధువులో, రక్త సంబంధీకులో, తెలియని వారో, తెలిసిన వారో వస్తుంటారు. వారి గతంలో మనతో ఏమైనా ఆర్థిక తగాదాలు, ఇతర కారణాలు వల్ల తగాదా పెట్టుకుని మనపై పగ పెంచుకుని ఉంటారు. అలాంటి వారు మన ఇంటి మీదకు వచ్చినప్పుడు Section 448 సహాయంతో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు.
అక్రమంగా ఇంటిని(House Trespass) ఆక్రమించుకుంటే?
ఈ సమాజంలో శత్రువు లేని మనిషి ఉండడు. మనం మంచిగా బ్రతుకుతున్నా మనల్ని ఆర్థికంగానైనా, సామాజికంగానైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. ఇలా మనల్ని ఇబ్బందులు పెట్టే వారిలో బంధువులు ఉండవచ్చు… స్నేహి తులు ఉండవచ్చు. మరెవరైనా ఉండవచ్చు. అలాంటి వారు మనపైన పగ పెంచుకొని ఉంటారు. ఎప్పుడు మనపై తగాద పెట్టుకుందామా? ఎప్పుడు దాడి చేద్దామా? అని ఆలోచిస్తుంటారు. వారితో మనకు గతంలో ఏమైనా ఆస్తి వద్దనో, డబ్బు వద్దనో, ఇతర కారణాల వల్లనో వాదన జరిగి ఉండివచ్చు.
అయితే మనం నివశిస్తున్న ఇంటిపైన మన అనుమతి లేకుండా దౌర్జన్యంగా వచ్చి మన Houseని, ఆస్తిని ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. కొన్ని సార్లు ఇంటిలో ఉన్నవస్తువులను చిందర వందర చేస్తుంటారు. పగల కొడుతుంటారు. ఇంట్లో ఆడవారు ఉంటే వారిపైనా దూషణలకు పాల్పడటం, వారిపైన దాడికి దిగటం లాంటివి కూడా చేస్తుంటారు. ఆ తర్వాత దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఈ ఇల్లు నాది అని బుకాయిస్తుంటారు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు.
ఇలా మన ఇంటి మీదకు అక్రమంగా ప్రవేశించి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసిన వారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, మన ఇల్లును ఆక్రమించుకోకుండా చూసుకోవాలంటే వారిపై ఈ సెక్షన్ 448 కింద వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా బంధువులు వచ్చి ఇంటిని ఆక్రమించుకోవాలను కున్నా, ఎవరైనా స్నేహితులు గానీ, ఇతర వ్యక్తులు గాని ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు మనం వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఈ సెక్షన్ 448 ఉపయోగపడుతుంది. వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడు ఏడాది పాటు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. తీవ్రత ఎక్కువుగా ఉంటే 2 నుండి 3 సంవత్సరాల కూడా శిక్ష పడే అవకాశం ఉంది.

సాధారణంగా మన ఇల్లు అడ్రస్, మన గురించి తెలిసిన వారు మన ఇంటికి వస్తుంటారు, పోతుంటారు. మనం కూడా వారి ఇంటికి వస్తుంటాం, పోతుంటాం. అలాంటి వారు మన మంచి కోరే వారే తప్ప చెడును కోరేవారు కాదు. ఇలా రాకపోకలు చేసే వారు తరుచుగా బంధువులు ఉండొచ్చు. ఇతర రక్త సంబంధీకులు ఉండొచ్చు. మరెవరైనా స్నేహితులు ఉండొచ్చు. కానీ కావాలని మన మీద పగ పెంచుకుని, పాత తగాదాలు మనసులో ఉంచుకొని అప్పుడప్పుడు మన ఇంటి మీదకు వస్తుంటారు. కొన్ని సార్లు మన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. అలాంటి వారి పట్ల ఈ సెక్షన్ 448 ద్వారా వారి మీద యాక్షన్ తీసుకొని వారిపై చర్యలకు పోలీసు వారిని సంప్రదించవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే మన ఇంటిని అక్రమంగా ఆక్రమించుకోవాలని అనుకునే వారిపైన ఈ సెక్షన్ 448 ద్వారా చర్యలు తీసుకోవచ్చు.