Second Wave Covid -19 : సెకండ్ వేవ్ వేగంగా విజృంభన.. రాష్ట్రాలు అలెర్ట్!
Second Wave Covid -19 : దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తుంది. దేశంలో కొత్తగా లక్షా 3558 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ తో 478 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు కోటి 25 లక్షల ఎనభై తొమ్మిది వేల 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు లక్షా 65 వేల 101 కి చేరిన కరోనా పాజిటివ్ మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,41,830 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 5.9 శాతం ఉంది.

రిపోర్టు లేకుంటే నో ఎంట్రీ అంటున్న రాష్ట్రం!
కరోనా వైరస్ రెండో దశ ఉధృతిని అరికట్టేందుకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నేటి(సోమవారం ) రాత్రి వేళ కర్ఫ్యూ విధించడం సహా, మల్టీఫెక్సీలు, జిమ్ కేంద్రాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బయటి రాష్ట్రాల నుంచి రాజస్థాన్ వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభయ్ కుమార్ మార్గదర్శకాలను ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పటికే కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ, వారాంతం లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన క్రమంలో రాజస్థాన్ కూడా అదే తరహా నిర్ణయం తీసుకోవడం గమనర్హం. రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 72 గంటల మించకుండా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంది. ప్రజలు బహిరంగంగా 100 మించి ఎక్కువ మంది గుమ్మిగూడి ఉండకూడదు. పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 5 నుంచి 19వ తేదీ వరకు తరగతులు నిషేధం విధించింది. వైద్య కళాశాలలు యథావిధిగా కొనసాగుతాయి.
రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా స్థానిక ప్రజల్ని కూడా అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రభుత్వం సూచించింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనల విషయంలో కఠిన చర్యలు తప్పవని, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

అయితే రాజస్థాన్ లో గడిచిన 24 గంటల్లో 1,729 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3.39 వేలకు చేరింది. కరోనా కారణంగా మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 2,829 కి చేరింది.
లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులు!
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ నకిలీ ఉత్వర్వలు తయారు చేసి, జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాకు వివరించారు. 4 రోజుల క్రితం శ్రీపతి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను తయారు చేసినట్టు తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో రాత్రి వేళల్లో లాక్డౌన్ విధిస్తారంటూ నకిలీ జీవో తయారు చేసి, సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ చేశారని తెలిపారు.

నిందితుడు నుంచి ఓ ల్యాప్ టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు సీపీ వెల్లడించారు. నిందితుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడని, ఆయన స్వస్థలం నెల్లూరు టౌన్ అని సీపీ వివరించారు. లాక్డౌన్ పై గతంలో ఇచ్చిన జీవోను డౌన్లోడ్ చేసుకుని, తేదీలు మార్చి, పాత జీవోను సంజీవ్, అతని స్నేహితులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారలను నమ్మవద్దని, ప్రధానంగా వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ గా ఉన్నవారంతా నిజనిర్థారణ చేసుకున్న తర్వాతనే సమాచారాన్ని సెండ్ చేయాలని సూచించారు. లేదంటే వారిపైనా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.
- Online class : చెట్టు కింద చదువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచనకు జేజేలు!
- Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!
- Myanmar Capital : ఆ రాజధానిని దెయ్యాల నగరంగా ఎందుకు పిలుస్తారు?
- khammam Municipal Election 2021: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రచారానికి రెఢీ!
- Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!