Second Wave: నాడు అగ్రరాజ్యాన్ని నేడు భారత్‌ను Covid చుట్టుముట్టింది!
Second Wave: కరోనా మహమ్మారి భారత్‌ను చుట్టుముట్టింది. ప్రజలెవ్వర్నీ ఊపిరాడనివ్వడం లేదు. మునుపెన్నడూ లేనంత ఉధృతితో ప్రభుత్వాలు, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క రోజులో మూడు లక్షలకు పైగా కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో దేశంలో మహమ్మారి బుసలు కొడుతోంది. తాజాగా దేశంలో ఒక్కరోజే 3.14 లక్షల మంది కరోనా భారిన పడగా అగ్ర రాజ్యం అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు భారత్‌లోనే నమోదవ్వడం గమనార్హం. అంతకు ముందు అమెరికాలో 24 గంటల్లో 3.07 లక్షల కేసులు బయటపడ్డాయి.
గడిచిన 24 గంటల్లోనే 16,51,711 మంది నమూనాలను పరీక్షించగా 3,14,835 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశంలోకి మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. వరుసగా రెండో రోజు 2 వేలకు పైగా మరణాలు సంభవించాయి. తాజాగా 2,104 మంది కరోనాతో మృత్యువాత ఒడిలోకి చేరుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసులు 1,59,30,965 కి చేరగా, 1,84,657 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాది జనవరిలో అమెరికాలో ఒక రోజులో మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత ఆ స్థాయి విజృంభణ భారత్‌లోనే కనిపిస్తుండటంతో భయాందోళనకు గురిచేస్తోంది. అలాగే వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.
ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 22 లక్షలక పైబడగా, ఆ రేటు 13.82 శాతానికి పెరిగింది. ఇక నిన్న (బుధవారం) ఒక్క రోజే 1,78,841 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోటీ 34 లక్షలమంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.01 శాతానికి పడిపోయి కలవరపెడుతోంది. మరోవైపు, నిన్న 22,11,334 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. మొత్తంగా 13.23 కోట్ల మంది టీకా తీసుకున్నారు.

కలవరం పెట్టిస్తోన్న రాష్ట్రాలు!
మహారాష్ట్రలో తాజాగా 67,468 మంది కరోనా బారిన పడగా 568 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రానికి దేశ రాజధాని ఢిల్లీ (24,638), ఉత్తర ప్రదేశ్(33,106) తోడయ్యాయి. ఢిల్లీలో 249 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇక ఛత్తీస్‌గఢ్ (193), యూపీ(187), గుజరాత్ (125), కర్ణాటక (116) లో గడిచిన 24 గంటల్లో 100పైగా మరణాలు సంభవించాయి. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారుతోంది. తాజాగా అక్కడ 10,784 కొత్త కేసులు, 58 మరణాలు సంభవించాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి