second home for investmentమనలో చాలా మంది చేతిలో నగదు ఉన్నప్పుడు ఎక్కవుగా షేర్లపైనో లేక బాండ్లపైనో పెట్టుబడులు పెడుతున్నారే తప్ప రియల్ ఎస్టేట్, బంగారం వైపు పెద్దగా చూడటం లేదంట. అయితే దీర్ఘకాలంలో సంపదను పెంచుకునే విషయానికొస్తే , రెండో ఇంటిపై పెట్టుబడి పెడితే మంచిదం టున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా వేతన జీవులకు అందుబాటులో ఉండే మెరుగైన సాధనాల్లో ఇది కూడా ఒకటని అంటున్నారు. గత యాభై ఏళ్లుగా వివిధ నగరాలు, కాల వ్యవధులను బట్టి (కనీసం 10 ఏళ్లు) చూస్తే దేశీయంగా రియల్ ఎస్టేట్ ధరలు వార్షికంగా 15-20 శాతం మేర (second home for investment)పెరుగుతూ వస్తున్నాయి.


అధిక మొత్తంలో లాభాలు రియల్టీవే
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినా, అవసరమైన సందర్భాల్లో కాస్త అధిక మొత్తాన్ని అందించగలిగేది రియల్టీ రంగమే. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం ఇలా ఇతరత్రా ఏ సాధనమైనా సరే మన పర్సులో నుంచి పూర్తి మొత్తం పెట్టి కొనుక్కోవాల్సిందే. అదే రెండో గృహం విషయానికొస్తే ఇంటి ధరలో సుమారు 20 శాతం మాత్రమే మన జేబు నుంచి కట్టి మిగతా మొత్తాన్ని హౌసింగ్ లోన్ తీసుకుని కట్టొచ్చు. ఈ రుణానికి సగటున కట్టే వడ్డీలో దాదాపు 3 శాతం దాకా ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు
రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టడం వల్ల పలు పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రెండో ఇంటిపై వచ్చే అద్దెను గృహ కొనుగోలుకు తీసుకున్న రుణంపై వడ్డీ భాగాన్ని కట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. ఒక వేళ కట్టే వడ్డీ కన్నా చేతికొచ్చే అద్దె తక్కువుగా ఉన్న పక్షంలో మీ ఆదాయంలో దాన్ని గృహ ఆస్తిపరంగా వచ్చిన నష్టం కింద చూపించుకుని, పన్నుల పరమైన వెసులుబాటు పొందవచ్చు.


స్థిరాస్థిని మాటిమాటికి అమ్మడం కుదరదు
మిగతావాటితో పోలిస్తే ఇంటి విషయంలో తీసుకునే నిర్ణయం భిన్నంగా ఉంటుంది. ఇంటిని మాటిమాటికి కొనడం, అమ్మేయడం వంటివి జరగదు. సాధ్యమైనంత వరకూ దీని ప్రయోజనాలను దీర్ఘకాలంలో పొందాలనే ఆలోచన ఉంటుంది. రేట్లు భారీగా పెరిగిపోయాయని అమ్మేసేయాలనే అత్యాశ గానీ లేదా రేట్ల పడిపోయాయని చింతించడం గానీ ఎక్కువుగా ఉండదు. కాబట్టి దీన్ని మానసికంగా ఆందోళన కలిగించే పెట్టుబడిగా భావించలేం. నిశ్చింత నిచ్చే పెట్టుబడి సాధనంగా చెబుతాం. ఇంటిని అద్దెకిస్త మనం కట్టే గృహం రుణం నెలసరి వాయిదాల్లో కొంత మొత్తం అద్దె రూపంలో సమకూరుతుంది కనుక ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.


రెండో ఇంటిని కొనే ముందు ఆలోచించుకోవాల్సిన విషయాలు
రెండో ఇంటిని కొనుక్కునే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. దీర్ఘకాలికంగా ఈఎంఐలు కట్టుకుంటూ పోవడం మీక సాధ్యపడుతుందా? లేదా? అన్నది చూసుకోవాలి. తరుచూ బదిలీలను ఎదుర్కొనే ఉద్యోగాలు కొంత మేరకు ఇబ్బంది కలగవచ్చు. అంతేకాదు ఏదైనా స్థిరాస్థిని కొనుగోలు చేసేటప్పుడు డెవలపర్ గురించి, ట్రాక్ రికార్డు గురించి ఇతరత్రా న్యాయపరమైన అంశాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?