SEC shock to AP village volunteers | పంచాయతీ ఎన్నికలకు గ్రామ వాలంటీర్లు దూరంగా ఉండాలి : ఎస్ఈసీ Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రప్రభుత్వానికి మరో షాకిచ్చారు. ఇప్పటికే 9 మంది ఐఎఎస్, ఐపిఎస్ ఉన్నతాధికారులను బదిలీ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లకు(AP village volunteers) కీలక ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు.
వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను తిరిగిచ్చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లు(AP village volunteers) ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా గ్రామ వాలంటీర్లు, దాదాపు 60 వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందించే సేవలు చేస్తున్నారు.


ఎన్నికల నోటిఫికేషన్ అమలు ఉన్నతం కాలం ఆదేశాలు: ఎస్ఈసీ
ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే 9 మంది ఉన్నతాధికారులను బదిలీ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్‌తో పాటు, జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి లేఖ రాశారు. బదిలీ చేసిన వారిలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, నలుగురు సీఐలు ఉన్నారు. ప్రస్తుతం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో రాసిన తన లేఖ విషయాన్ని కూడా తాజా లేఖలో ప్రస్తావించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
గతేడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అధికారులను బదిలీ చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 22న చర్యలు చేపట్టింది. తనకున్న విచక్షణాధికారాలతో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారిని తొలగించారు.
గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ నుంచి ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ, చిత్తూరు ఎస్పీకి ఛార్జ్ అప్పగించాలని సూచించారు. సుప్రీం తీర్పు వచ్చిన అనంతరం పంచాయతీ రాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ ప్రతిపాదనలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించారు. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నందున బదిలీలు సరికావని ఆయన స్పష్టం చేశారు.
ఇది చదవండి: కరోనా సేవలకుగాను సీఐకి ప్రశంసాపత్రం అందజేత
ఇది చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు
ఇది చదవండి:నూతన సచివాలయం నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్