ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టత!
AP State Election Commissioner : తన పదవీకాలం పూర్తవ్వడానికి వారం రోజులే ఉంది. కాబట్టి నేను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేను. అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తేల్చి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుందన్నారు. ఈ బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని చెప్పారు. ప్రస్తుత మున్న పరిస్థితుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల చేయలేనని వివరించారు.
ఏకగ్రీవాలపై ఫిర్యాదు చేసుకోవచ్చు!
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయమై ఏకగ్రీవాలు జరిగిన చోట నచ్చకపోతే ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కడైనా దౌర్జన్యాలు, బెదిరంపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన వారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు, ప్రభుత్వ యంత్రాగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. భారత ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం , కేంద్ర ఎన్నికల సంఘం అవలంభించిన మంచి పద్ధతులను అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
- Online class : చెట్టు కింద చదువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచనకు జేజేలు!
- Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!
- Myanmar Capital : ఆ రాజధానిని దెయ్యాల నగరంగా ఎందుకు పిలుస్తారు?
- khammam Municipal Election 2021: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రచారానికి రెఢీ!
- Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!