SEC Announce Municipal Elections in AP: మున్సిప‌ల్ షెడ్యూల్ విడుద‌ల | మార్చి 10 నుంచి ఎన్నిక‌లు

SEC Announce Municipal Elections in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మ‌రం మ‌ళ్లీ మొద‌లైంది. సోమ‌వారం మున్సిప‌ల్ ఎన్నిక‌ల న‌గ‌రా మోగింది. 12 మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, 75 మున్సిప‌ల్, న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సోమ‌వారం షెడ్యూల్ విడుద‌లైంది. తాజా షెడ్యూల్ ప్ర‌కారం మార్చి 10న మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌క్రియను కొన‌సాగిస్తూ ఈసీ తాజా నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ‌తంలో నిలిచిన ప్ర‌క్రియ నుంచే కొన‌సాగించేలా ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంట‌ల్లోపు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ఇచ్చారు.

ఎన్నిక‌లు జ‌రిగే మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు ఇవే!

విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్ట‌ణం, ఏలూరు, విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుప‌తి, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతపురం.
మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీలు
శ్రీ‌కాకుళం జిల్లా : ఇచ్చాపురం, ప‌లాస – కాశీబుగ్గ‌, పాల‌కొండ‌
విజ‌యన‌గ‌రం జిల్లా : బొబ్బిలి, పార్వ‌తీపురం, సాలూరు, నెల్లిమ‌ర్ల‌
విశాఖ జిల్లా : న‌ర్సీప‌ట్నం, య‌ల‌మంచిలి
తూర్పుగోదావ‌రి జిల్లా : అమ‌లాపురం, తుని, పిఠాపురం, సామ‌ర్ల‌కోట‌, మండ‌పేట‌, రామ‌చంత్రాపురం, ఏలేశ్వ‌రం, గొల్ల‌ప్రోలు, ముమ్మిడివ‌రం
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా : న‌ర్సాపురం, నిడ‌ద‌వోలు, కొవ్వూరు, జంగారెడ్డి గూడెం
కృష్ణా జిల్లా:- నూజివీడు, పెడ‌న‌, ఉయ్యూరు, నందిగామ‌, తిరువూరు
గుంటూరు జిల్లా : తెనాలి, చిల‌క‌లూరి పేట‌, రేప‌ల్లె, మాచ‌ర్ల‌, స‌త్తెన‌ప‌ల్లి, వినుకొండ‌, పిడుగురాళ్ల‌
ప్ర‌కాశం జిల్లా : చీరాల‌, మార్కాపురం, అద్దంకి, చీమ‌కుర్తి, క‌నిగిరి, గిద్ద‌లూరు
నెల్లూరు జిల్లా : వెంక‌ట‌గిరి, ఆత్మ‌కూరు (ఎన్‌), సూళ్లూరుపేట‌, నాయుడుపేట‌
అనంత‌పురం జిల్లా : హిందూపురం, గుంత‌క‌ల్లు, తాడిప‌త్రి, ధ‌ర్మ‌వ‌రం, క‌దిరి
అనంత‌పురం జిల్లా : రాయ‌దుర్గం, గుత్తి, క‌ళ్యాణ‌దుర్గం, పుట్ట‌ప‌ర్తి, మ‌డ‌క‌శిర‌
క‌ర్నూల్ జిల్లా : ఆదోని, నంద్యాల‌, ఎమ్మిగ‌నూరు, డోన్‌, ఆళ్ల‌గ‌డ్డ‌
క‌ర్నూల్ జిల్లా : నందికొట్కూరు, గూడురు(కె), ఆత్మ‌కూరు (కె)
వైయ‌స్సార్ జిల్లా : ప్రొద్దుటూరు, పులివెందుల‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు, బ‌ద్వేల్‌, రాయ‌చోటి, మైదుకూరు, ఎర్ర‌గుంట్ల‌
చిత్తూరు జిల్లా : మ‌ద‌న‌ప‌ల్లె, పుంగ‌నూరు, ప‌ల‌మ‌నేరు, న‌గరి, పుత్తూరు.

గ‌తేడాది మార్చి 23న నిర్వ‌హించాల్సిన ప‌ట్ట‌ణ‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు క‌రోనా కార‌ణంగా అదే నెల 15న వాయిదా ప‌డ్డాయి. 12 న‌గ‌ర పాల‌క సంస్థ‌ల్లో డివిజ‌న్లు / వార్డుల‌కు వివిధ రాజ‌కీయ ప‌క్షాల అభ్య‌ర్థులుగా, స్వ‌తంత్రులుగా 6,563 మంది అప్ప‌ట్లో నామినేష‌న్లు వేశారు. 75 పుర‌పాల‌క‌, న‌గ‌ర పంచాయ‌తీల్లోనూ వార్డు స్థానాల‌కు 12,086 మంది నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఉప‌సంహ‌ర‌ణ ద‌శ‌లో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి, ప్ర‌స్తుతం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నాలుగు ద‌శ‌ల్లో పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తోంది. వాయిదా వేసిన ప‌ట్ట‌ణ‌, స్థానిక సంస్థ‌ల‌కు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎస్ఈసీ తాజాగా నిర్ణ‌యించింది.

చ‌ద‌వండి :  Harassment by Financiers : ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

ఇది చ‌ద‌వండి:ఖ‌మ్మం పాత బ‌స్టాండ్‌పై పెద్ద‌ల క‌న్ను

ఇది చ‌ద‌వండి:జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా కేంద్రం అడుగులు!

ఇది చ‌ద‌వండి: ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త నిబంధ‌న‌లు..ఇక జ‌రిమానానే!

ఇది చ‌ద‌వండి: నాగ‌చైత‌న్య ఖాతాలో మ‌రో కొత్త ల‌వ్‌స్టోరీ సాంగ్‌!

ఇది చ‌ద‌వండి:బాల‌య్య‌పై అందుకే అమిత‌మైన ప్రేమ‌!

ఇది చ‌ద‌వండి:ఇల్లందు మైన్స్‌లో ఆచార్య షూటింగ్‌!

ఇది చ‌ద‌వండి:మంత్రి కొడాలి నాని స్వ‌గ్రామంలో వైసీపీకి షాక్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *