Sebastian PC524 Trailer | SR కళ్యాణ మండపంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో కిరణ్ అబ్బవరం సెబాస్టీన్ పిసి 524 సినిమాతో మరోసారి ముందుకు వచ్చారు. సెబాస్టీన్ పిసి524 సినిమా ట్రైలర్ సోమవరం విడుదలైంది. బాలాజీ సయ్యపురెడ్డి ఆద్వర్యంలో వస్తున్న ఈ సినిమా కామెడీతో క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించనుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో హీరో కిరణ్ తనదైన స్టైల్లో కామెడీని పంచి, నేచురల్ నటనతో ఫ్యాన్స్‌కు దగ్గర (Sebastian PC524 Trailer) అయ్యారు.
ఈ సెబాస్టీస్ పిసి524 సినిమా కూడా ఎస్.ఆర్ కళ్యాణ మండపం సినిమా లాగానే కామెడీతో స్టార్ట్ అయి థ్రిల్లర్ క్రైమ్ స్టోరీతో ముగిసే విధంగా ఉంది. చీకటా..వాడెమ్మా! అండర్ కంట్రోల్ ఆఫ్ సెబాస్టీనుడు ఉండగా వీచే గాలి, లేని వెలుతురు, ఉన్న చీకటి సాక్షిగా అంటూ డైలాగ్‌ను మీరే ఫ్రేమ్ చేసుకోండి అన్నా అంటూ హీరో కిరణ్ చెప్పిన డైలాగు చాలా ఫన్నీగా ఉంది. ఈ సినిమాలో హీరో కిరణ్ ది పోలీసు పాత్ర. అతనికి చీకటి అంటే భయం.
ఈ సినిమాలో పోలీసు డ్యూటీల విషయంలో మధ్య మధ్యలో కామెడీ ఉండనుంది. సార్..నాకు పగలు పూట డ్యూటీలు వేయండి సార్..రాత్రిపూట వేయవద్దు సార్ అంటూ ఎస్సైని హీరో కిరణ్ విన్నవించు కోవడం ట్రైలర్లో చూడవచ్చు. ఒక హత్య కేసు విషయంలో స్టోరీ సీరియస్‌గా నడుస్తుంది. ఈ హత్య కేసులో హీరో కిరణ్ పాత్ర కీలకంగా మారనుంది. అతన్ని పోలీసు ఉద్యోగం నుండి ఎందుకు సస్పెండ్ చేశారనేది సినిమా చూస్తే గాని మనకు ఉన్న సస్పెండ్ పోదు.
ఈ సినిమాలో హీరో కిరణ్ అప్పవరంతో పాటు హీరోయిన్గా నువేక్ష, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో ఇప్పటికే వేలమంది చూశారు. ట్రైలర్ చాలా బాగుం దని, సినిమా పక్కా హిట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా మార్చి 1వ తేదీన విడుదల కానుంది.
Cast: Kiran Abbavaram, Nuveksha & Komalee Prasad
Written & Directed By: Balaji Sayyapureddy
Dop: Raj K Nalli
Music Director: Ghibran
Art Director: Kiran Mamidi Bfa
Editor: Viplav Nyshadam
Executive Producer: K L Madhan
Sound Design: Sync Cinema
Marketing Partner: Ticket Factory
Pro: Naidu Surendra Kumar
Head Of Marketing:Chavan Prasad
Vfx Supervisor: Veera Nagendra
Titles: Saboo
Poster Designer: Gowtham
Costume designer: Rebecca v
Chief AD : Uday pendela
Producers: Siddareddy B, Raju, Pramod
Banner: Jovitha Cinemas
Presenter: Elite Entertainment Presents
Audio On: Aditya Music