Scissors Attack మదనపల్లి: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యపై భర్త కత్తెరతో పొడిచి చంపడానికి ఒడిగట్టాడు. స్థానికులు అడ్డుకుని బాధితురాలిని 108 లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మదనపల్లి లో బుధవారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఆస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా (Scissors Attack)ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, ఈడిగపల్లి సమీపంలో ఉన్న యాతాల వంకకు చెందిన సురేఖ(31), పదేళ్ల క్రితం మదనపల్లిలోని మంజునాథ కాలనీకి వచ్చి స్థిరపడింది. అక్కడే ఓ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. అప్పటికే భర్తను వదిలేసిన సురేఖ మంజునాథ కాలనీలో ఉంటున్న టైలర్ ఎల్లప్పతో ప్రేమలో పడింది. మొదటి భర్తతో తెగదెంపులు చేసుకుని 8 ఏళ్ల క్రితం ఎల్లప్పను రెండో వివాహం(ప్రేమవివాహం) చేసుకుంది.
సురేఖకు నలుగురు పిల్లలు ఉన్నారు. టైలర్ వృత్తి చేస్తున్న ఎల్లప్పకు భార్య సురేఖ నడవడిక పై అనుమానం పెంచుకున్నాడు. గత రెండేళ్లుగా తరుచూ గొడవలు పడుతూ భార్యను ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో అనుమానం పెనుభూతమై బుధవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భార్యని నిలదీసి గొడవ పడ్డాడు. సురేఖ భర్తను ఎదిరించి మాట్లాడటంతో ఆగ్రహంతో అతని వద్ద ఉన్న టైలరింగ్ కత్తెరిని తీసుకుని భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఒళ్లంతా పొడిచి గాయాలు చేయడంతో 9 చోట్ల కత్తిపోట్లు పడి సురేఖ అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు గమనించి బాధితురాలని 108 సాయంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న టూ టౌన్ సిఐ నరసింహులు, సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!