Scientific study tipsచురుగ్గా ఉంటూ, సమయానికి చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకునే పిల్లలు కొందరయిత..ప్రతిభ ఉన్నా సరే చదువును నిర్లక్ష్యం చేసేవారు మరికొందరు. అలాంటి పిల్లల్లో (Scientific study tips)మార్పు తేవాలంటే.
వ్యాయామం చేసిన తర్వాత జిమ్ తరగతులకు వెళ్లే పిల్లలు చాలా చురుగ్గా ఉంటారనీ, ఏకాగ్రతతో చదువుతారనీ, మంచి మార్కులూ తెచ్చుకుంటారనీ చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పిల్లలకు శారీరక శ్రమ అలవాటు చేయండి. రోజులో కనీసం గంట వ్యాయామం చేసేలా చూడండి.
తీపి, కొవ్వు, ఉప్పు శాతం ఎక్కువుగా ఉండే పదార్థాల్ని పిల్లలు ఎక్కువుగా తినడం వల్ల వాళ్ల ఐక్యూ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సుమారు నాలుగు వేల మంది చిన్నారులపై చేసిన అధ్యయనంలో ఇది రుజువైంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ ప్రాసెస్ చేసిన పదార్థాల్ని వాళ్లకు పెట్టకుండా చూడండి. వాటికి బదులుగా పండ్లూ, కూరగాయలూ, చేపలూ, పాస్తా లాంటివి అందివ్వండి. జంక్పుడ్ని పూర్తిగా మానేయండి.
సంగీత పాఠాలు నేర్చుకునే ఆరు నుంచి పదకొండేళ్ల పిల్లల్లో మెదడు చురుగ్గా ఉంటుందని యూనివర్శిటీ ఆఫ్ టొరంటో చెబుతోంది. అధ్యయన కర్తల కొందరు పిల్లల్ని ఎంచుకుని వారికి సంగీతం లేదా డ్రామా పాఠాలు కొన్నాళ్లు నేర్పించారు. కొందరికి అసలేవీ చెప్పలేదు. ఆ తరువాత వాళ్ల ఐక్యూని గమనిస్తే సంగీతం నేర్చుకునే వారిలో ఐక్యూ స్థాయి పెరిగిందని తేలింది. కాబట్టి పిల్లలకు ఏదో ఒక సంగీతాన్ని నేర్పించడం తప్పనిసరి.


పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని కథలు చదవడం, వారికి వివరించడం, తరువాత ప్రశ్నలు వేయడం, వాళ్ల నుంచి సమాధానాలు రాబట్టడం లాంటివి చిన్నతనం నుంచీ చేయాలి. దానివల్ల వాళ్లలో ప్రశ్నించే తత్వం, ఊహించుకోవడం అలవడుతుంది. పిల్లలు ఐక్యూ కూడా బాగా పెరుగుతుంది. పిల్లలకు పొద్దుటిపూట తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ తినిపించాలి. పోషకాల మిళితమైన అల్పాహారం వాళ్లూ తినడం వల్ల రోజంతా చురుగ్గా ఉంటారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?