Sciatica

Sciatica Pain: వెన్నుముక నుంచి పాదం దాకా ఒక‌టే నొప్పిగా ఉందా? అయితే స‌యాటికానే!

Spread the love

Sciatica Pain | ఆధునిక యుగంలో స‌యాటికా అనే ప‌దం విని వారుండ‌రు. తుంటి ఎముక నుంచి పాదం దాకా ఉండే ఈ స‌యాటికా నొప్పి భ‌రించ‌రానిదిగా ఉంటుంది. ఇది దైనందిన జీవితాన్ని కూడా ఆటంక‌ప‌రుస్తుంది. అయితే స‌రియైన స‌మ‌యంలో చికిత్స(Sciatica Pain) తీసుకుంటే ఈ స‌మ‌స్య‌ను పూర్తిగా న‌యం చేయ‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా 30 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సులో క‌నిపిస్తుంది.

స‌యాటికా నిర్మాణం ఎలా ఉంటుంది?

మ‌న శ‌రీరంలోకెల్లా అత్యంత పొడ‌వైన న‌రం స‌యాటికా న‌ర‌మే. ఇది వెన్నుపాము నుంచి మొద‌లై, పిరుదుల గుండా తొడ వెనుక భాగంలోకి, అక్క‌డి నుంచి ప‌క్క‌ల‌కు, మ‌రియు పాదాల‌దాకా వెళుతుంది. స‌యాటికా న‌రం పాదాల ప‌నితీరును, స్ప‌ర్శ‌ను నియంత్రిస్తుంది. ఇది ఐదు ఇత‌ర న‌రాల స‌మూహంతో ఏర్ప‌డుతుంది. ఈ స‌యాటికా న‌రం మీద ఒత్తిడి ప‌డిన‌ప్పుడు క‌లిగే నొప్పినే Sciatica Pain అంటారు. స‌యాటికా న‌రం వెళ్లే మార్గంలో ఎక్క‌డైనా నొప్పి క‌ల‌గ‌వ‌చ్చు. దీని వ‌ల్ల కాళ్ల‌ల్లో తిమ్మిర్లు, స్ప‌ర్శ త‌గ్గిపోవ‌డం, మంట‌, న‌డ‌క‌లో మార్పు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

హెర్నియేటెడ్ డిస్క్ గురించి

దీన్నే డిస్క్ ప్రోలాప్స్ అని కూడా అంటారు. వెన్ను పూస‌ల మ‌ధ్య‌లో ఉండే Disc, మృదులాస్థితో త‌యార‌వుతుంది. ఇది షాక్ అబ్జ‌ర్వ‌ర్‌గా ప‌నిచేస్తుంది. వంగ‌డానికి, ఇత‌ర ప‌నులు చేసుకోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. సాధార‌ణంగా వ‌య‌సు పెరిగే కొద్దీ డిస్కులు బ‌ల‌హీన ప‌డి డిస్కు అంచు అన‌గా అన్యుల‌స్ పైబ్రోసిస్ చిరిగి లోప‌ల ఉండే మెత్త‌ని జిగురు Nucleus ప‌ల్పోసిస్ బ‌య‌టికి రావ‌డాన్నే హెర్నియేష‌న్ అంటారు. ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిన హెర్నియేడేడ్ డిస్క్ న‌రాల పైన ముఖ్యంగా స‌యాటికా న‌రంపైన నొక్కిన‌ప్పుడు క‌లిగే ల‌క్ష‌ణాల‌ను స‌యాటికా నొప్పి అంటారు.

వెన్నుపూస‌లోని ఎముక‌లు ప‌రిమితికి మించి ముంద‌కు గానీ, వెనుక‌కు గానీ జార‌డాన్ని స్పాండైలో లిస్థిసిస్ అంటారు. కానీ వెన్నుపూస‌ల్లోని ఎముక‌ల‌ను ప‌ట్టి ఉంచే లిగ‌మెంట్లు, సాగ‌డం వ‌ల్ల ముఖ్యంగా బ‌రువులు ఎత్త‌డం, కొన్ని ర‌కాల క్రీడ‌లు ఆడ‌టం వ‌ల్ల‌, లేదా వెన్నుముక ప్రాక్చ‌ర్స్ వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. వ‌య‌సు పైబ‌డటం వ‌ల్ల వెన్నుపూస‌లు బ‌ల‌హీన‌ప‌డిన కార‌ణంగా కూడా ఈ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంది.

స్పైన‌ల్ స్టినోసిస్‌

వెన్ను పూస‌ల లోప‌ల ఒక నాళం ఉంటుంది. దీన్నే స్పైన‌ల్ కెనాల్ అంటారు. ఈ నాళం ఇరుకుగా మార‌డం లేదా మూసుకుపోవ‌డాన్నే స్పైన‌ల్ స్టినోసిస్ అంటారు. ఈ Canalలో వెన్నుపాము మ‌రియు ఇత‌ర న‌రాల స‌మూహం ప్ర‌యాణిస్తుంది. ఏ కార‌ణం చేతనైనా న‌డుము భాగంలోని ఈ నాళం ఇరుకుగా మారిన‌ట్ల‌యితే వెన్నుపాము పైన ఒత్తిడి ప‌డుతుంది. దీనివ‌ల్ల తీవ్ర‌మైన న‌డుము నొప్పి, కాళ్ల‌ల్లో తిమ్మిర్లు రావ‌డం, మొద్దుబార‌డం వంటి స‌యాటికా ల‌క్ష‌ణాల‌తో పాడు మ‌ల‌మూత్రాల విస‌ర్జ‌నపై నియంత్ర‌ణ కోల్పోవ‌డం, కాళ్లు చ‌చ్చుబ‌డ‌టం వంటి ల‌క్ష‌ణాలు క‌నిప‌స్తాయి. దీన్నే Lumbar కెనాల్ స్టినోసిస్ అంటారు. స‌యాటికా నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం పొందాలంటే ప్ర‌స్తుతం ఆసుప‌త్రుల్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. అదే విధంగా ఆయుర్వేద విధానంతో కూడా ఈ నొప్పి నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Lemongrass benefits: నిమ్మ‌గడ్డేగాన‌ని తీసి పారేయ‌కండి..ఉప‌యోగాలు తెలుస్తే షాక్ అవుతారు!

Lemongrass benefits | నిమ్మ‌గ‌డ్డి వాడ‌కం ఈనాటిది కాదు. వంట‌కాలు, సౌంద‌ర్య చికిత్స‌ల్లో దీనిని విస్తృతంగా ఉప‌యోగిస్తారు. నిమ్మ‌గ‌డ్డి లేకుండా Thai వంట‌కాలుండ‌వు. అన్ని చోట్లా సులువుగా Read more

Over Dieting: బ‌ల‌వంతంగా తినాల‌ని చూడ‌కండి కొంచెం కొంచెం తినండి!

Over Dieting | ప్ర‌తి ఒక్క‌రూ అందంగా, నాజుగ్గా ఉండాల‌ని అనుకోవ‌డం స‌హజం. లావుగా అవుతున్నామ‌ని భావించి శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవ‌డం మానేయ‌కూడ‌దు. త‌గినంత‌గా ఆహారం Read more

Hepatitis Bతో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఇవి త‌ప్ప‌కుండా తెలుసుకోండి!

Hepatitis B | హెప‌టైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెప‌టైటిస్‌-బి వైర‌స్ ద్వారా ఈ వ్యాధి వ‌స్తుంది. ఈ హెప‌టైటిస్ బి వైర‌స్ మ‌న శ‌రీరంలోకి Read more

Suganda dravyalu ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చ‌దివితే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు!

Suganda dravyalu | సుగంధ ద్ర‌వ్యాలు, మూలిక‌ల‌ను వంట‌ల్లో వాడితే ఆహార ప‌దార్థాలు రుచిక‌రంగా ఉండ‌ట‌మే కాదు. గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని అమెరికాకు చెందిన పోషకాహార Read more

Leave a Comment

Your email address will not be published.