School Reopen: జనగామ: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాలతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పున ప్రారంభానికి ఏర్పాటు చేసినట్టు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తో కలిసి కలెక్టర్లతో మాట్లాడారు.
విద్యా సంస్థల్లో పారిశుద్ధ్యం బాధ్యత సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లదేనని , పిల్లలకు జ్వర సూచనలుంటే కోవిడ్ పరీక్షలు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నిఖిల, జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్ పాగల సంపత్ రెడ్డి మాట్లాడారు.


విద్యా సంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పూర్వాపరాలను పరిశీలించి, అందరి అభిప్రాయాలను స్వీకరించి సెప్టెంబరు 1వ తేదీ(School Reopen) నుంచి అన్ని విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రులు తెలిపారు.
విద్యా సంస్థలు తెరిచిన తర్వాత రెసిడెన్షియల్, పాఠశాల్లోని పిల్లలకు జ్వర సూచన ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు సమీపంలోని పీహెచ్సికి తీసుకు వెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒక వేళ కరోనా నిర్థారణ అయితే సదరు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాలతో సహా ఓపెన్
రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రత్యక్ష తరగతులు మొదలు కానున్నాయి. కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యా సంస్థలను పునః ప్రారంభించే అంశంపై నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో అన్ని విద్యా సంస్థలను, వసతి గృహాలను శుభ్రపరచి ఈ నెల 30వ తేదీలోగా శానిటైజేషన్ చేయాలని పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను ఆదేశించారు.
కరోనాతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం
కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యా సంస్థలు మూతపడటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యా సంస్థల పునః ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను అనుసరిస్తోన్న వ్యూహాలను సమావేశంలో క్షుణ్ణంగా చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో జనసంచారం సాధారణ పరిస్థితుల్లో ఉంది. ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటో తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలను మళ్లీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని నెలలుగా పాఠశాలలు మూతపడి ఉండటం వల్ల గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో పారిశుద్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు తీసుకోవాలి.


ఆయా ఆవరణాలను శుభ్రంగా ఉంచే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్లు, మున్సిపల్ ఛైర్మన్లదే, వారు ఈ నెలాఖరు కల్లా మరుగుదొడ్లు, విద్యా సంస్థల ఆవరణాలను రసాయనాలతో పరిశుభ్రంగా చేయించాలి. నీటి ట్యాంకులను కడిగించాలి. తరగతి గదులను శానిటైజ్ చేయించాలి.
జడ్పీ ఛైర్మన్లు తమ జిల్లాల్లో మండల అధ్యక్షులు మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా ఉన్నాయో లేవో పరిశీలించాలి. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు పరిశీలించే బాధ్యత తీసుకోవాలి.
తరగతులకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా శానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను విధిగా పాటించాలి. ప్రతి రోజూ తమ పిల్లలు మాస్క్లు ధరించేలా, ఇతర నిబంధనలు పాటించేలా చూడాలని మంత్రులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హమీద్, భాస్కర్, జెడ్పి సిఇఓ విజయలక్ష్మి, డిఆర్డిఓ రాంరెడ్డి, జనగామ మున్సిపల్ ఛైర్మన్ జమున, తదితర అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!