School Closed

School Closed: పంజాబ్‌లో స్కూళ్లు మూత

National

School Closed : Panjab : క‌రోనా వైర‌స్ మ‌రోసారి విజృంభించ‌డంతో పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లుచోట్ల ఆంక్షలు అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వం, ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినత‌రం చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా శ‌నివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్టు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌క‌టించారు. మార్చి 31 వ‌ర‌కు విద్యా సంస్థ‌ల‌న్నీ మూసివేయ‌నున్న‌ట్టు తెలిపారు.

అలాగే, సినిమా థియేట‌ర్లు, షాపింగ్ మాల్స్‌పైనా ప‌రిమితులు విధించారు. సినిమా థియేట‌ర్లు 50 శాతం సామ‌ర్థ్యంతో న‌డిచేందుకు అవ‌కాశం క‌ల్పించారు. క‌రోనా గొలుసును ఛేదించేందుకు ప్ర‌జ‌లంతా రెండు వారాల పాటు సామాజిక కార్య‌క్ర‌మాల‌కు దూరండా ఉండాల‌ని సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ విజ్ఞ‌ప్తి చేశారు. కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో ప‌రిమిత సంఖ్య‌లో త‌మ ఇళ్ల‌లోనే కార్య‌క్ర‌మాలు జాగ్ర‌త్త‌గా నిర్వ‌హించుకోవాల‌ని కోరారు. ఈ నిబంధ‌న‌ల‌న్నీ రేప‌టి నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *