Sc St Reservation

Sc St Reservation: నేడే ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల‌పై కీల‌క తీర్పు

National

Sc St Reservation న్యూఢిల్లీ: ప‌దోన్న‌తుల విష‌యంలో ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న అంశంపై సుప్రీం కోర్టు శుక్ర‌వారం కీల‌క తీర్పును వెలువ‌రించ‌నున్న‌ది. ఇందుకై కేంద్రం, రాష్ట్రాల త‌ర‌పున వాద‌న‌ల‌ను ఇంత‌కుముందే విన్న జ‌స్టీస్ నాగేశ్వ‌ర‌రావుతో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం గ‌తేడాది అక్టోబ‌ర్ 26న తీర్పును రిజ‌ర్వ్‌లో ఉంచింది కోర్టు. స్వాతంత్య్రం వ‌చ్చి 77 ఏండ్లు గ‌డిచిన‌ప్ప‌టీ ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌ను ఉన్న‌త స్థాయి వ‌ర్గాల‌తో స‌మానంగా తీసుకురాలేక‌పోయామ‌ని గ‌తంలో కేంద్రం(Sc St Reservation) వాదించింది.

గ్రూపు ఏ వంటి ఉన్న‌త క్యాట‌గిరీ ఉద్యోగాల‌ను ఎస్సీ, ఎస్టీలు పొంద‌డం కొంచెం క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని, వారికి కొన్ని వెసులుబాట్లు క‌ల్పించాల‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే ప‌దోన్న‌తుల్లో ఎస్సీ,ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌బోమ‌ని, రిజ‌ర్వేష‌న్ల‌పై రాష్ట్రాలు నిర్ణ‌యం తీసుకోవాల‌నుకుంటే తీసుకోవ‌చ్చ‌ని గ‌త‌లో 2018లోనే సుప్రీం కోర్టు తెలిపింది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *