SBI Mudra Loan : ఎస్‌బిఐ ముద్ర లోన్ గురించి ఇక్కడ తెలుసుకోండి. అసలు ఈ ముద్ర లోన్ అంటే ఏమిటి? లోన్ వాల్యూ ఎంత ఉంటుంది. వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి. ఈ ముద్ర లోన్ యొక్క ఉపయోగాలు ఏమిటి? అసలు ఈ లోన్ ఎవరికి ఇస్తారు? ఇది ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన ఇక్కడ తెలుసుకుందాం.
SBI Mudra Loan : ఎస్‌బిఐ ముద్ర లోన్
SBI Mudra Loan లో Term Loan, Working Capital Loan, Overdraft ఈ మూడు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. Term Loan అంటే ఎక్కువ సంవత్సరాలు ప్రాసెస్. ఇందులో ఉదాహరణకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలా వ్యవధి ఉండి ఎక్కువ లోను ఇవ్వడం జరుగుతుంది. Working Capital Loan లోనులో ఉద్యోగం చేసేవారికి లేదా వ్యాపారం చేసేవారికి ఇస్తుంటారు. ఇది చాలా తక్కువ టైంలో ఈ లోను అత్యవసరాలకు ఇస్తుంటారు.
Overdraft లోను అంటే ఉదాహరణకు మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయను కోండి. మనకు లక్షా 50,000 వేలు కావాల్సి ఉంటే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ అమౌంట్‌తో పాటు ముద్ర కార్డు కూడా ఈ లోను కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్‌బిఐ ముద్ర లోనులో మూడు రకాల స్కీములు ఉంటాయి. అవి Shishu, Kishor, Tarun స్కీములు ఉంటాయి.
ముద్ర లోనులో ఎంత లోను ఇస్తారు?
ఈ Mudra Loan Schemes లో Loan Amount ఈ విధంగా ఉంటాయి. Shishu Scheme లో కొత్తగా జాయిన్ అయిన వారికి బేసిక్ రూ.50,000 వేల నుండి ప్రారంభమవుతుంది. ఇది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఇస్తారు. దీనికి సంబంధించిన ఎటువంటి పత్రాలు ఇవ్వకుండానే పొందవచ్చు.
Kishor Scheme లో ప్రారంభం రూ.50,001 నుండి రూ.5,00,000 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. Tarun స్కీము లో ప్రారంభం రూ.5,00,001 నుండి రూ.10,00,000 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కిషోర్, తరుణ్ లోన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలను కుంటే మీరు కచ్చితంగా బ్యాంకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధంచిన డాక్యుమెంట్స్ అనగా మీ షాపుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కానీ, మీ ఫైనాన్సియల్ డాక్యుమెంట్స్‌ను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
శిశు లోనుకు మాత్రం మీరు మొబైల్‌లో అప్లై చేసుకోవచ్చు. కిషోర్, తరుణ్ లోన్లకు సంబంధించి మాత్రం కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాలి. ఈ లోన్లకు సంబంధించి ఏమైనా Margin కావాలనుకుంటే మన దగ్గర ఈ లోను తీసుకునే ముందు బిజినెస్ చేసేవారి దగ్గర కొంత అమౌంట్ ఉండి తీరాలి. అయితే శిశు లోనుకు మాత్రం ఎలాంటి మార్జిన్ అవసరం లేదు. అదే విధంగా కిషోర్, తరుణ్ లోన్ తీసుకోవాలనుకుంటే మార్జిన్ కావాల్సి ఉంటుంది.
10% మార్జిన్ అంటే ఉదాహరణకు ఒక 1,00,000 లక్ష పెట్టి బిజినెస్ చేయాలనుకుంటే మీ దగ్గర 10% అనగా 10,000 వేలు మీ దగ్గర ఉండాలి. బ్యాంకు వారు 90,000 వేలు మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ లోన్ యొక్క వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి అంటే ఆ వ్యక్తి అప్లై చేసుకునే బిజినెస్ లోనుపైన, సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్‌పై ఆధార పడి ఉంటుంది. బిజినెస్ బ్యాంకు లావాదేవీలు ట్రాన్సక్షన్స్‌పైన ఆధార పడి ఉంటుంది.
ముద్ర లోనులో వడ్డీ రేట్లు
SBI బ్యాంకులో లోన్ రేటు 9.75% వారి అప్లికేషన్‌ను బేస్ చేసుకుని ప్రారంభమవుతుంది. లోన్ అమౌంట్ మాక్సిమ్ రూ.10,00,000 లక్షలు లోన్ వ్యవధి 1 నుండి 5 సంవత్సరాల వరకు ఆధార పడి ఇప్పుడు చెప్పిన వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. Bank of Baroda బ్యాంకు వారు 9.65 % వడ్డీ రేటు, Oriental Bank of Commerce బ్యాంకు వారు 8.15% వడ్డీ రేటుపై లోను ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఎస్‌బిఐ ముద్ర లోను (SBI Mudra Loan) లో శిశు గానీ, కిషోర్ గానీ లోను తీసుకునే వారికి Processing Charges లాంటివి ఉండవు. అదే విధంగా తరుణ లోను తీసుకునే వారికి మాత్రం వారికి ఇచ్చే లోను అమౌంట్‌లో Processing Charge 0.50% ఉంటుంది. అంతే కాకుండా GST కూడా ఉంటుంది. ముద్ర లోనుకు సంబంధించి ఎలాంటి సెక్క్యూరిటీ కానీ Collateral కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్యారింటీ కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈ ముద్రలోనులో Repayment Tenure 3-5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏమైనా విపత్తు వచ్చి మీరు లోను కట్టలేకపోతే సుమారు 6 నెలల వరకు వెసులుబాటు కల్పిస్తారు. ఆ తర్వాత ఈ 6 నెలల అమౌంట్ మొత్తం నెక్ట్స్ లోనులో కట్టాల్సి వుంటుంది. ఈ ముద్రలోనులో Foreclosure Charges ఏమీ ఉండవు. మీ దగ్గర లోన్ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు గడువు ఉన్నప్పటికీ మీరు మూడు సంవత్సరాలకే మొత్తం చెల్లిస్తే దానికి ఎటువంటి ఛార్జీలు అదనంగా ఉండవు. నిరభ్యంతరంగా లోన్ తీర్చుకోవచ్చు.
ప్రస్తుతం బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే కచ్చితంగా ఇన్సూరెన్స్ అవసరం పడుతుంది. కానీ ఈ ముద్ర లోనులో ఎటువంటి ఇన్సూరెన్స్ అవసరం ఉండదు. ఈ లోను కింద ఎటువంటి సబ్సీడి ఉండదు. ఎంత లోను తీసుకుంటే అంత వడ్డీతో నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. మహిళలకు వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యేకంగా లోను ఇవ్వడం జరుగుతుంది ఈ ముద్ర లోనులో.
లోను అప్లైకి కావాల్సిన డాక్యుమెంట్స్
ఈ SBI Mudra Loan అప్లై చేసుకునే వారు అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత పాస్‌పోర్ట్ సైజు ఫొటో ఇవ్వాలి. పాస్‌పోర్టు గానీ, ఓటర్ ఐడి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎలక్ట్రికల్ బిల్ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులము అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు బ్యాంకు ఖాతాకు సంబంధించిన 6 నెలల ట్రాన్స్‌సెక్షన్ స్టేట్ మెంట్ అవసరం ఉంటుంది. బిజినెస్ ప్రారంభిస్తే దాని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.