Saving money plan శ్రీదేవి ఓ ప్రైవేటు ఉద్యోగి. పాప చదువు కోసం, తాను బంగారం కొనుక్కోవడం కోసం ఎంతో కొంత కూడబెట్టాలని అనుకుంటోంది. ఈ ఆలోచననే ఏడాదిగా చేస్తోంది. కానీ.. కూడబెట్టడమే కుదరడం లేదు. కారణం జీతం చేతిలో పడటమే ఆలస్యం ఖర్చవ్వ డానికి వచ్చినంత సమయం కూడా పట్టడం(Saving money plan) లేదు. ఇంటి ఖర్చులు, హఠాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రయాణాలు, శుభకార్యాలు, ఎక్కడికి వెళ్లకపోయినా సమస్యే! ఇక అనారోగ్యం వస్తే తప్పక ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇది ఒక్క శ్రీదేవిదే కాదు..సగటు ఉద్యోగులందరి వేదన.


రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు మనుషులను కుదేలు చేస్తున్నాయి. ఇలాంటి వాటి నుంచి బయటపడి సంపద పోగెయ్యాలంటే ఓ పక్కా ప్రణాళిక చేసుకోవాలి మరి. అదేలా ఉండాలంటే..సంపాదిస్తే వచ్చేది సంపాదన. అందులో ఖర్చులు పోను మిగిల్చినది సంపద. ఎంతో కొంత సంపద కూడబెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సిన మొదటి పని ప్రణాళిక వేసుకోవడం.
ఏ ప్రణాళిక లేకుండా ఆర్థిక పురోగతి సాధించడం దాదాపు అసాధ్యం. అందుకే ప్రతి ఖర్చుని లెక్కించుకోవాలి. పక్కాగా రాసుకోవాలి. ఇలా చేయకపోవడం వల్ల ఎంత వస్తుంది? ఎంత ఖర్చవుతోంది? ఇంకా ఏమేం ఖర్చులు ఉన్నాయి? ఎంత అవుతుంది? అనే విషయాలు తెలియదు. ప్రణాళిక ఉండటం ద్వారా దేనికి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తున్నారో తెలుస్తోంది. ఎక్కడ డబ్బు మిగిల్చే అవకాశం ఉందో అర్థమవుతోంది. ఇలా ఆదాయాన్ని, ఖర్చును, పొదుపును కలిపి ప్రణాళిక వేసుకోవాలి.


బీమాతో ధీమా(insurance plans)
డబ్బు కూడబెట్టే క్రమంలో అన్నింటికన్నా ముందు చేయాల్సిన పని జీవిత బీమా తీసుకోవడం. చాలా మంది ఈ విషయాన్ని అనవసర ఖర్చుగా భావిస్తారు. దీన్ని ఓ అత్యవసరంలా గుర్తించాలి. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా కూడా తీసుకోవడం ఆ ఒక్కరికే కాదు మొత్తం కుటుంబానికి మంచింది.
ఖర్చులు తగ్గితే…(cost money)
ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ కూడబెట్టవచ్చని అనుకుంటారు చాలా మంది. కానీ వస్తున్న ఆదాయంలో ఖర్చులు తగ్గించుకున్నా డబ్బు మిగులుతుందన్న అసలు విషయాన్ని గ్రహించరు. కేవలం సంపాదనపైనే దృష్టి పెట్టకుండా వచ్చిన దాంట్లో ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయడం గురించి కూడా ఆలోచించాలి.
ఎమర్జెన్సీ ఫండ్..(emergency fund)
మరో ముఖ్య విషయం ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. ఎంత ప్రణాళిక ప్రకారం డబ్బులు దాచినా, అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి. అలాంటప్పుడే ఈ అత్యవసర నిధి అవసరమవుతోంది. ఆరోగ్య, ప్రమాద బీమా లాంటివి ఉంటే.. ఇలాంటప్పుడు వైద్య ఖర్చులకు ఆసరా ఉంటుంది. కనీసం ఆరు నెలల వేతనం అంత డబ్బును కూడబెట్టుకుంటే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.


ఎక్కువ పొదుపు..(More savings)
డబ్బుకి కాలానికి చాలా సంబంధం ఉంది. ఎక్కువ కాలం దాచిపెట్టిన డబ్బు ఎక్కువుగా లాభాలను అర్జిస్తుంది. అంటే చిన్న వయసులో పొదుపు మొదలు పెడితే త్వరగా సంపద సాధించవచ్చు. పొదుపు చేయడం ఆలస్యం చేసిన ప్రతి రోజు కూడబెట్టాలనే మీ ఆశయం మరింత ఆలస్యం అవుతుంది. ఎక్కువ డబ్బును కూడబెట్టాలనుకుంటే ఆదాయ మార్గాన్ని పెంచుకోవడం, దాచుకునే డబ్బును పెంచాలి. ఖర్చును మాత్రం తగ్గించుకోవాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా చేస్తే మీరు తప్పకుండా సంపన్నులే!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!