Save Cormorant bird: సముద్రంలో కొట్టుకు వచ్చిన సీసాలోని ప్రేమ కథ శివమణి సినిమాగా హిట్ అయింది. ప్రేమ కథ కాకపోయినా ఇలాంటి సీసా సీనే రియల్‌గా కూడా జరిగింది. న్యూయార్క్ హార్బర్లో 2013లో కడలి ఒడిలోకి చేరిన ఓ సందేశాత్మక బాటిల్ దాదాపు 5,700 కిలోమీటర్లు ప్రయాణించి.. 2016 లో ప్రాన్స్ తీరానికి చేరింది. ఇంతకీ న్యూయార్క్‌లో ఈ బాటిల్‌ను సముద్ర పాలు చేసిన వ్యక్తి మంచి ఆర్టిస్ట్. పేరు జార్జ్ బూరుజి. అందమైన డ్రాయింగ్ ఒకటి వేసి, లెటర్‌తో సహా సీసాలో పెట్టి నీళ్లలో వదిలేశాడు. అది ఫ్రాన్స్‌కు చెందిన బ్రిగిటీకి దొరికింది.
ఆమె తన భర్తతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు తీరంలో ఈ సీసా తారసపడింది. బాటిల్ మూత తీసి చూస్తే, ఓ పేపర్లో కార్మోరాంట్ అనే జాతి పక్షి బొమ్మ అందంగా చిత్రించి ఉంది. వాటిని కాపాడాలని లేఖలో కోరాడు. దీంతో పాటు ఆ బాటిల్ దొరికినవారికి అభినందనలు తెలియజేస్తూ, రిప్లై పంపాల్సిందిగా తన మెయిల్ ఐడీ కూడా రాశాడు ఆర్టిస్ట్. మొత్తానికి పేపరుపై జార్స్ గీసిన చిత్రలేఖనాన్ని చూసి మురిసిపోయింది బ్రిగిటీ. ఆమె ప్రతిగా సాగర లేఖ కాకుండా ఈ – మెయిల్ ద్వారా అతడికి రిప్లై పంపింది. చిత్రమేమిటంటే. మొత్తానికి తీరం చేరిన కళల బాటిల్ మరో కళాకారిణికే దొరికింది. ఆ బాటిల్ అందుకున్న బ్రిగిటీ కూడా పెయింటర్ కావడం ఇక్కడ విశేషం.


- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!