Satyavedu | తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని City Clinic పేరుతో నడుస్తున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ పసికందు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వైద్యం పేరుతో సిటీ క్లినిక్ సెంటరును పీఎంపీ వైద్యులు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో బుచ్చినాయుడు కండ్రిక మండలం తలారివేట్టు వేణుగోపాలపురం యానాది కాలనీ చెందిన నాగయ్య సతీమణి లక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డను వారం క్రితమే ప్రసవించింది.
Satyavedu: వైద్యం వికటించి పసికందు బలి
ప్రసవించిన బిడ్డతో పాటు బాలింతను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో రెండ్రోజుల ముందు తమిళనాడు మాధరపాకం పన్నూరు గ్రామానికి బంధువుల ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పసికందుకు దగ్గు అధికం కావడంతో సోమవారం ఉదయం వైద్యచికిత్స కోసం Satyavedu సిటీ క్లీనిక్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ City Clinic PMP వైద్యులు పసికందును పరీక్షిస్తే రూ.2 వేలు అవుతుందని తెలిపినట్టు బాధితులు పేర్కొంటున్నారు. అంత సొమ్ము లేకపోవడంతో బిడ్డ తల్లి దండ్రులు మళ్లీ మాధరపాకం వెళ్లి బంగారు వస్తువును తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని సిటీ క్లినిక్ వద్దకు మరలా వచ్చారు.
దీంతో పీఎంపీ వైద్యులు పసికందుకు Injection వేయడంతోపాటు మందులు ఇచ్చారు. ఇందుకు రూ.1600 వైద్యునికి చెల్లించినట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. చికిత్స చేసిన గంటలోపే పసికందు మృతి చెందింది. అయితే ఆసుపత్రి యాజమాన్యం గుట్టుచప్పుకు కాకుండా మృతి చెందిన పసికందుతో పాటు తల్లిదండ్రులను వారి ఇంటికి పంపించారు. సమాచారం అందుకున్న అంబేదర్కర్ ఆర్మీ నాయకుడు రాజా, సిపిఎం మండల నాయకులు రమేష్, అరుణాచలం తదితరులు మంగళవారం రంగ ప్రవేశం చేయడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో బాధిత వర్గాలను కలిసి జరిగిన సంఘటన ఆరా తీయడంతో పాటు మృతి చెందిన పసికందు తల్లిదండ్రులతో Satyavedu పోలీసు స్టేషన్ చేరుకుని నకిలీ వైద్యం చేసిన వైద్యులు విజయ భాస్కర్‌రావుపై ఫిర్యాదు చేశారు. పట్టణంలోని సిటీ క్లినిక్ పేరుతో ప్రైవేటు ఆసుపత్రిలో ఇప్పటికే వైద్యం వికటించి మూడు వరుస మరణాలు సంభవించాయి. నెల క్రితమే కన్నవరం గ్రామానికిచెందిన పాస్టర్ కూడా ఇక్కడ వైద్యం వికటించి మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై అప్పట్లో బాధిత వర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించారు.
అయితే ఆందోళన సందర్భంగా రెండు వారాల పాటు సిటీ క్లినిక్ మూతపడింది. తదనంతరం ప్రైవేటు ఆసుపత్రి తెరిచి యథావిధిగా వైద్యం చేయడం ప్రారంభించారు. కానీ చికిత్స కోసం వస్తున్న రోగులకు సరైన వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం, జబ్బు ఒకటైతే వైద్యం మరొకటి అన్నట్టు వైద్యం చేయడం, అధిక మోతాదులో మందులు ఇంజక్షన్ ద్వారా వేయడం తదితర కారణాల వల్ల సిటీ క్లినిక్ కేంద్రానికి వెళ్తున్న రోగులు పలువురు మృత్యువాత పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యం వికటించి వరుస మరణాలు చోటు చేసుకుంటున్న సంబంధిత వైద్యాధికారులతో చలనం లేదు.
నకిలీ వైద్యంతో ముప్పు!
ప్రైవేటు క్లినిక్ నకిలీ వైద్యులతో జిల్లా వైద్యాధికారులు కాసుల కోసం కక్కుర్తిపడి కుమ్మక్కై కావడం వల్లే తరుచూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరక్ష రాస్యతను, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వైద్య చికిత్స కోసం వెళుతున్న పలు రోగుల నుంచి ప్రైవేటు క్లినిక్ పరీక్షల పేరుతో, వైద్యం పేరుతో ఇష్టారాజ్యంగా ఇంజక్షన్ వేస్తూ ఉండటం వల్ల మరణ మృదంగం తాండవిస్తున్నాయి. సిటీ క్లినక్ పిఎంపి వైద్యులు విజయ భాస్కర్‌రావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.