Satya Nadella Son Dies

Satya Nadella Son Dies: స‌త్య నాదెళ్ల ఇంటిలో విషాదం కుమారుడు జైన్ నాదెళ్ల మృతి

National

Satya Nadella Son Dies | మైక్రోసాప్ట్ అధినేత స‌త్య నాదెళ్ల కుమారుడు జైన్ (26)(Zain Nadella) మంగ‌ళ‌వారం కన్నుమూశారు. కొంత కాలంగా జైన్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. జైన్ నాదెళ్ల పుట్ట‌క‌తోనే సెలెబ్ర‌ల్ ప‌ల్సీతో బాధ‌ప‌డుతూ చిన్న‌ప్ప‌టి నుంచి వీల్ చైర్‌కే ప‌రిమిత‌మైయ్యారు. తన కుమారుడు చ‌నిపోయిన‌ట్టు మైక్రోసాప్ట్ సీఈఓ స‌త్య నాదెళ్ల (Satya Nadella Son Dies) త‌న ఉద్యోగుల‌కు తెలియ‌జేశారు. జైన్ నాదెళ్ల వ‌య‌సు ప్ర‌స్తుతం 26 సంవ‌త్స‌రాలు.

జైన్ బాధ‌ప‌డుతున్న వ్యాధి సెల‌బ్ర‌ల్ ప‌ల్సీ అంటే మెద‌డు ప‌క‌క్ష‌వాతంగా వైద్యులు చెబుతున్నారు. అయితే మెద‌డు నుండి శ‌రీర భాగాల‌కు స‌రైన స్పంద‌న ఉండ‌క పోవ‌డంతో జైన్ చిన్న‌ప్పటి నుంచే ప్ర‌త్యేక అవ‌స‌ర‌ల‌తో పెరిగారు. జైన్ నాదెళ్ల‌కు బ్రెయిన్ ప‌ల్సీ ఉన్న‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులు కుమారుడును ఎంతో ముద్దుగా పెంచుకున్నారు. అత‌నికి అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందించారు. కానీ రోజురోజుకూ జైన్ మెద‌డులో ఉన్న వ్యాధి పెరిగిపోవ‌డంతో అత‌ని మెద‌డు ప‌నిచేయ‌డం ఆగిపోయింది. ఈ కార‌ణంతోనే జైన్ నాదెళ్ల మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. స‌త్య నాదెళ్ల కుమారుడు జైన్‌తో పాటుగా ఇద్ద‌రు కూతుళ్లు కూడా ఉన్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *