satellite internet india భారతీయులకు శుభవార్త. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచనలనాలను నమోదు చేసింది. అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్ను అందించిన మొబైల్ నెట్వర్క్ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్ మస్క్ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్ యూజర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు అతి తక్కువ ధరకే(satellite internet india) లభించనున్నాయి.

అయితే ఈ నేపథ్యంలో శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఎలా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతుండగా స్టార్ లింక్ స్పందించింది. భారతీయులకు అనుగుణంగా శాటిలైట్ ఇంటర్నెట్ను సబ్సిడీకి అందివ్వనున్నట్టు తెలిపింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు ప్రకారం మన దేశంలో స్టార్ లింక్ తన సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను సబ్సీడి రేట్లతో అందించే ఆలోచనలో ఉన్నట్టు స్టార్ లింక్ కి ఇండియా హెడ్ సంజయ్ భార్గవ్ తెలిపారు. భారత్‌లో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర తక్కువుగా ఉంటాయని అన్నారు. వినియోగదారులు చెల్లించే ధరలకంటే అందించే సేవలు ఎక్కువుగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ లింక్ ప్రస్తుతం దేశంలోని అంతర్గత ప్రాంతాలపై దృష్టి సారించినట్టు వెల్లడించారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. తక్కువ ధర, సరైన సదుపాయాల్ని కల్పించడం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ రూపురేకల్ని మార్చవచ్చని అన్నారు.

శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు
స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. బుకింగ్‌లో భాగంగా కొనుగోలు దారులు రూ.7,500 డిపాజిట్ చెల్లించాలి. అలా చెల్లించిన వారికి ప్యాకేజీలో భాగంగా స్టార్ లింక్ డిష్ శాటిలైట్, రిసీవర్, సెటప్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుంది. ప్రారంభంలో ఇంటర్నెట్ స్పీడ్ 100- 150ఎంబీపీఎస్ పరిధిలో ఉంటుంది. అయితే తక్కువ భూ కక్ష్యలో మరిన్నిస్టార్ లింక్ శాటిలైట్లను పంపడం ద్వారా ఇంటర్నెట్ వేగం జీబీపీఎస్ కి చేరుకోవచ్చని స్టార్‌లింక్ ప్రతినిధులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభదశలో ఉండగా వచ్చే ఏడాది జూన్ జులై నాటికి కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. అయితే నివేదికలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సెటప్ ను స్టార్ లింక్ సంస్థ 100 పాఠశాలలకు ఉచితంగా అందజేస్తుందని, వాటిలో 20 సెటప్‌లు ఢిల్లీ పాఠశాలలకు, మిగిలిన 80 సెటప్‌లు ఢిల్లీ చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్టు స్టార్ లింక్ ఇండియా బాస్ సంజయ్ భార్గవ్ స్పష్టం చేశారు.

- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి