Sasikala Quits Politics : Chennai : తమిళనాడులో రాజకీయం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల ముందు చిన్నమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు శశికళ. ఇటీవల జైలు నుంచి వచ్చిన ఆమె తమిళనాడులో రాజకీయాల్లో కీలక మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే అన్యూహంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. తాను ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదని చిన్నమ్మ ఆ ప్రకటనలో తెలిపింది. జైలు నుంచి విడుదలైన తర్వాత శశికళ, దినకరన్ మళ్లీ అన్నాడిఎంకే లో చేరేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే చివరి వరకు వారి ప్రయత్నం చేసినప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం వారి ఎంట్రీకి మాత్రం నో చెప్పారు. అన్నిదారులు మూసుకుపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శశికళ ప్రకటన చేశారు. జయలలిత బంగారు పాలన మళ్లీ రావాలని కోరుకున్నట్టు తెలిసింది.
అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో దోషిగా జైలు శిక్షను పూర్తి చేసుకుని,2021 ఏడాది జనవరిలో వీకే శశికళ విడుదలైంది. తనను బహిష్కరించిన అన్నాడీఎంకే పార్టీపై తిరిగి పట్టు సాధించ బోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు రావడం, ఇటీవల జయలలిత జయంతి రోజు తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఆమె ఇంటికి క్యూకట్టడం, దీంతో శశికళ మళ్లీ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ వాటన్నింటినీ తలక్రిందులు చేస్తూ ఏకంగా రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. పొలిటికల్, పబ్లిక్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏనాడూ పదవి ఆశించలేదు!
‘దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు గానీ, పదవిలో లేన్నప్పుడు గానీ నేను ఏనాడు అధికారం, పదవి కోసం ఆశించలేదు. జయ మరణం తర్వాత కూడా ఆ రెండింటీని(పదవి,అధికారం) నేను కోరుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. అయితే జయ స్థాపించిన పార్టీ (ఏఐఏడీఎంకే) గెలవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె వారసత్వం కలకాలం కొనసాగుతుంది.’ అని లేఖలో శశికళ పేర్కొంది.

బీజేపీ ఒత్తిడే కారణమా?
జయ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి బీజేపీ పార్టీ చొచ్చుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సామ దాన బేధ దండోపాయాలతో శశికళను జైలుకు పంపింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలను మచ్చిక చేసుకుంది. దీంతో అన్నాడీఎంకేను ఎన్డీఏ భాగస్వామిగా మలుచుకోవడం లాంటివ పరిణామాలు వేగంగా జరిగాయి. ఈ ఏడాది జనవరిలో శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత పొలిటికల్ సీన్ ఆమె అనుకున్నట్టు జరగలేదు. అన్నాడీఎంకే పై శశికళ పట్టు సాధించడానికి విశ్వప్రయత్నం చేసింది. ఈ క్రమంలో బీజేపీ శశికళను రాజకీయంగా ఒత్తిడికి గురిచేస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ శశికళ మునుపటి లాగా చేస్తే మళ్లీ జైలుకు పంపేందుకు బీజేపీ వెనుకాడబోదనే వాదనలను విస్తృతంగా వినిపించాయి. చివరికి రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి పూర్తిగా తప్పుకోవడం ద్వారా సైలెంట్ అయిపోవాలనే శశికళ నిర్ణయించుకోవడం డీల్‌లో భాగంగా జరిగిందేనా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంలో ఆమెను నమ్ముకున్న మేనల్లుడు దినకరన్ ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.
ఇది చదవండి:10 life changing Principales
ఇది చదవండి:లోన్ల పేరుతో కొత్త తరహా మోసం
ఇది చదవండి: విక్టరీ ఆధ్వర్యంలో రాబోతున్న దృశ్యం 2
ఇది చదవండి:మయన్మార్ లో ఆగని నిరసనలు! నిర్భంధంలోనే సూచీ!
ఇది చదవండి:ముఖానికి కవర్‌తో నైట్రోజన్ గ్యాస్ పీల్చి యువకుడు ఆత్మహత్య
ఇది చదవండి: రూ.500 కే టివీ అంట..ఆరా దీస్తే!