Chek power : ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్ లకు చెక్ పవర్ లేకపోవడంతో వారు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఏమైనా పనులు చేయాలంటే చెక్‌పవర్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని తెలిపారు.
Chek power : సర్పంచ్‌లకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. మూడు నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12 వేల మంది సర్పంచ్ లకు ఇంత వరకూ చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి 12 వేల గ్రామాల్లో చేపట్టాల్సిన పారిశుధ్య పనులకు నిధులు రాక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిఎఫ్ఎంఎస్ ఖాతా క్రింద ఉన్న గ్రామ పంచాయతీ నిధులు మరియు 14,15వ ఆర్థిక సంఘం నిధులను సుమారు రూ.3 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడేసుకుందని ఆరోపించారు. అందుకే సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడం లేదా? అని ప్రశ్నించారు. దీని వల్ల కరోనా నివారణ చర్యలు చేపట్టలేక సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారన్నారు. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవ్వడంతో గ్రామీణ ప్రజలు కరోనా బారినపడి చనిపోతున్నారన్నారు. తక్షణమే సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇచ్చి గ్రామీణ ప్రజల్ని ఆదుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని డిమాండ్ చేశారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!