Sankranti: ప్రకృతిలో సంభవించే అరుదైన మార్పు, సూర్యుడు మరకరాశిలోకి ప్రవేశించేది, కాలగతిలో మార్పునరకుసాత్కారం ఉత్తరాయన పుణ్యకాల ప్రారంభం. సంక్రమణ సందర్భం. తెలుగింటి ఆత్మీయ పండగ భోగి, సంక్రాంతి, కనుమ.
ఈ మూడు రోజుల పాటు అందరూ భోగి మంటలు, హరిదాసులు, డూడూ బసవన్నలు, రంగవళ్ళులు, సంక్రాంతి నోములు, వాయినాలు, నువ్వులు బెల్లాలు, సకినాలు, అరిసెలు, గాలిపటాల సయ్యాటలతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఈ సంకాంత్రి Sankranti, పండుగలో సంప్రదాయంతో పాటు శాస్త్రీయత ఇమిడి ఉందన్నది ఆశ్చర్యం కలిగించక మానదు. అవి ఏమిటో ఇప్పుడు చూద్ధాం.
Sankranti: ప్రకృతి సిద్ధం భోగి మంటలు
సంక్రాంతి పండగలో మొదటిది ముఖ్యమైంది భోగి. ఈ రోజు భోగిమంటలు వేస్తారు. పంటలు పండి ఇళ్ళకు వచ్చిన సందర్భంగా పరిసరాల్లో ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఈ భోగిమంటలు రక్షిస్తాయని భావిస్తారు. సంక్రాంతి కీడును దూరం చేస్తుందని నమ్ముతారు. ప్రాచీన ఋషులు సౌరహోమం చేసేవారు. రానురాను బోగిమంటలుగా మారింది. ఇందులో జువ్వి, మేడి, రావి, జామ, మోదుగు చెట్లు సమిధులను వేసి కాల్చుతారు. చుట్టూ చేరి చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతారు.
శాస్త్రీయత: చలికాలంలో వేకువజామున ఏర్పాటు చేసే ఈ భోగిమంటల వల్ల చలి దూరం అవుతుంది. ఇందులో ఐదు రకాల చెట్ల కర్రలను వేయడం వల్ల కాలుష్యం కారకాలు దూరం అవుతాయని, శ్వాసకోస వ్యాధులు రాకుండా కాపాడుతాయని ఆయుర్వేద వైద్యం సూచిస్తోంది.
ఆయుష్షు పెంచేవి భోగిపళ్లు
పండుగ రోజు చిన్నారుల తలపై ప్రత్యేకంగా భోగిపళ్ళు చెరకు గడలు, జీడిపళ్ళు, రేగు పళ్ళను పోస్తారు. ఇందులో రేగుపళ్లు విష్ణువుకు ప్రీతికరమంటారు. దుష్ట శక్తులు, ఎవరి దృష్టి తమ పిల్లలపై పడకూడదని, ఆయుష్షు పెరగాలని ఇలా చేస్తారు.
శాస్త్రీయత : సూర్యుని sun, నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల చిన్నారులకు శారీరక వ్యాధులు ప్రబులుతాయని, వాటి నివారణకు చెరకు గడలు తీపిని, రేగుపళ్లు పులుపును, జీడిపళ్లు చేదును ఇస్తాయి. వీటి వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
సకినాలు అరిసెలు
సంక్రాంతి Sankranti, అంటే వెంటనే గుర్తుకు వచ్చేవి సకినాలు, గారెలు, అరిసెలు. ఈ పిండి వంటలను ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. వీటిలో బియ్యపు పిండితో పాటు నువ్వులు, బెల్లం తప్పకుండా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారంలో కూడా మార్పులు అవసరం.
శాస్త్రీయత : పిండి వంటల్లో వేడి చేసే నువ్వులు Sesame seeds, బెల్లం jaggery, తప్పకుండా వాడతారు. వీటి వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతో జీర్ణ కోశ వ్యాధులు దరికి చేరవు.
అరుదైన గొబ్బెమ్మలు
ఈ మూడు రోజులు ఇంటి ముంగిళ్ళలో ఆవు పేడతో కల్లాపి చల్లి చక్కని రంగులతో ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలను పేర్చి సుందరంగా అలంకరిస్తారు. గొబ్బెమ్మలకు మద్య పూలు, గరిక పోచలు, కుంకుమ పసుపు చల్లుతారు. ఇలా పేర్చడంతో సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
శాస్త్రీయత : ఆవు పేడ ఔషధంగా ఉపయోగపడుతుంది. కల్లాపి చల్లటంతో క్రిహిసంహారిణిగా, బాక్టీరియా నిర్మూలనకు దోహదపడుతుంది. పూలు, కుంకుమ, అగరువత్తులు గొబ్బెమ్మల్లో పేర్చడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది మనస్సును ఎంతో ఉత్తేజపరుస్తుంది.
హరిదాసులు, డూడూ బసవన్నలు
పంటలు సమృద్ధిగా ఇంటికి ధాన్యాలను తీసుకువచ్చే సందర్భంగా చేసుకునే పండగ సంక్రాంతికి హరినామ సంకీర్ణనలు చేయాలంటారు. అందుకే హరినామ పారాయణం చేసే హరిదాసులకు ధాన్యాన్ని దానంగా ఇస్తారు. రైతన్న నేస్తాలు ఎడ్లు శివుని వాహనంగా భావిస్తూ గంగిరెద్దుల వారిని వాటితో ఆటలు ఆడించి, వారిని పిలిచి ధాన్యాన్ని అందజేస్తారు. ఇక విశాలమైన ప్రదేశంలో గాలి పటాలను ఎగురవేస్తారు. ఆకాశంలో ఎగిరే గాలిపటాలతో అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతారు. ఇలా ఆడటం ఒక సంప్రదాయంగా మారింది. శత్రువును ఎలా ఎదుర్కోవాలి వంటి పోరాట పటిమను ప్రతిబింబిస్తుంది.
మదినిదోచే రంగవళ్ళులు
పండగకు ఇంటి ముంగిళ్లలో వేసే రంగవళ్లల్లో ముఖ్యంగా చుక్కల ముగ్గులో తెలుగు సంప్రదాయం కనువిందు చేస్తుంది. దీంతో పాటు శాస్త్రీయత చోటు చేసుకుంటుంది.
శాస్త్రీయత : సున్నం, పసుపు, కుంకుమలతో పాటు పలు రకాల ప్రకృతి సిద్ధమైన రంగులతో క్రిములు చనిపోతాయి. వాటిని చూడటం మనస్సుకు ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది.
గడపుకు పసుపు రాయడం
పండగ రోజున గడపకు తప్పకుండా పసుపు turmeric, కుంకుమలను రాస్తారు. కొత్త పంట ఇంటికి వస్తుందని, ఇలా చేయడం వల్ల ఎలాంటి సూక్ష్మక్రిములు ఇంట్లోకి రావని నమ్ముతారు.
శాస్త్రీయత : పసుపు అనేది మంచి రోగ నివారణిగా పనిచేస్తుంది. బాక్టీరియా, వైరస్లను దరి చేరకుండా చేస్తుంది. అలాగే ప్రకృతి సిద్ధమైన కుంకుమ కూడా పర్యావరణ పరిరక్షణలో పనిచేస్తుంది.
నువ్వులు, బెల్లం
Sankranti ప్రత్యేకంగా నువ్వులు, బెల్లం నిలుస్తున్నాయి. విష్ణుమూర్తికి నువ్వులు (తిలలు) ప్రీతికరం. బెల్లం లక్ష్మీదేవికి ప్రతిరూపం. లక్ష్మీనారాయణలకు ప్రతిరూపంగా నువ్వులు, బెల్లం ఉండలను భావిస్తారు. సకల సంపదలు, సమృద్ధిగా రావాలని కోరుకుంటారు. ఈ పర్వదినం రోజున వీటిని తప్పకుండా ఆరగిస్తారు.
శాస్త్రీయత : నువ్వులు, బెల్లం తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు రాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేటట్టు తోడ్పడతాయి.
సంక్రాంతి నోములు, వాయినాలు
ఈ పండగ వచ్చిందంటే కొత్త వస్త్రాలు, కొత్త అల్లుళ్లు సందడి నెలకొంటుంది. ఈ సందర్భంగా నోములు నోచుకుంటారు. సంక్రాంతి లక్ష్మిని స్వాగతిస్తూ నోములు చేస్తారు. ముత్తయిదువులను ఇంటికి పిలిచి వారి పాదాలకు పసుపు రాస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు.
శాస్త్రీయత : పాదాలకు పసుపు రాయడం వల్ల కాళ్ళ పగుళ్లు నిలిచిపోతాయి. అలాగే ఈ నోములు మధ్య ఆత్మీయతను ప్రతిబింబిస్తాయి. సంఘటితంతో ఉంటే అభివృద్ధి సాధ్యమనే సందేశమిస్తుంది.