Sankatahara Chaturthi Vratham: సంకటహర చతుర్థి ఈ నెల 12 అనగా రేపు(శనివారం). ఈ రోజును హిందువులు పవిత్రంగా పూజిస్తుంటారు. భక్తితో గణపతిని పూజిస్తే కష్టాలు తొలిగిపోతాయని వారి నమ్మకం. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు నిర్వహిస్తారు. రాత్రి చంద్ర దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఉపవాసం ఉన్నవారికి చంద్రోదయం సమయం అవసరం.
Sankatahara Chaturthi Vratham | సంకటహర చతుర్థీ వ్రతం!
ప్రతి ఏడాది వినాయకుని అనుగ్రహం పొందేందుకు భాద్రపద శుద్ధ చవినినాడు వినాయకచవితి పర్వదినం జరుపుకుంటుంటాం. మనం ఏ పని చేసినా ముందుకు పోకుండా, అన్నిటా విఘ్నాలు కలుగుతూ, వారీరక, మానసిక రుగ్మతులు, రుణ బాధలు, జీవితంలో పలు రకాల కష్టాలు కలిగినప్పుడు ప్రతి మాసంలోనూ సంకట హర చతుర్థినాడు యథాశక్తి విగ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలిగి సుఖ సంతోషాలు కలగడంతో పాటు కార్యజయం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.
సంకటహరచతుర్థి ఎప్పుడు వస్తుంది?
ప్రతి మాసంలోనూ వచ్చే బహుళ చతుర్థి (బహుళ చవితి) ని సంకట హర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహార్థశ నడుస్తున్నవారు, కష్టాలు, కడగళ్లనుభవించేవారు, తరచు కార్యహాని కలుగుతున్నవారు ఈ వ్రతం చేయడం మంచిది. ఆరోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట గుడికెళ్లి గరికపై ప్రమిదనుంచి దీపారాధన చేసి, గరికపోచలు, పుష్పాలు, పత్రితో గనఫతిని పూజించి, లడ్డూలు లేదా ఉండ్రాలు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి.
ప్రతి మాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు (Sankatahara Chaturthi Vratham) ఇదేవిధంగా ఆచరించగలిగితే సకల దోషాలు పోయి, సత్ఫలితాలు కలుగుతాయి. కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థినాడూ వినాయక చవితిరోజు చేసినట్లే పత్రితోనూ, పుష్ఫాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతో పాటు ఈ కింద స్తోత్రాన్ని విడువకుండా ఆరుమాసాలపాటు పఠించటం వల్ల చక్కటి ఫలితముంటుంది.
వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం సంకటహర గణపతి స్తోత్రాన్ని నాలుగుసార్లు పారాయణ చేసినా మంచిదే. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలు తొలుగుతాయి.
సంకష్టహర చతుర్థి (Sankatahara Chaturthi) నియమాలు ఇవే!
- కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థినే గ్రహించాలి.
- ఈ వ్రతం సంకల్పించిన రోజు శ్రావణ బహుళ చవితి తెల్లవారు ఝామునే నిద్రలేచి, గణపతిని ప్రార్థించి, స్నానాది అనుష్టానాలు పూర్తి చేసుకుని 108 సార్లు గణపతిని స్మరించడం, స్తోత్రాదులు పారాయణం చేయడం విధి.
- సర్వ ఉపద్రవాలు, దీర్ఘవ్యాధులు, భయ, మిధ్యాపవాద దోషాలు, నానా కష్టాలు ఉపశమించడానికై వినాయక ప్రీత్యర్థం ఈ వ్రతం చేయువారికి, వారి కామితార్థం సత్వర ఫల ప్రాప్తి నందగలదు.
- పూజ చేయురోజున పగటిపూట ఉపవాసం ఉండాలి.
- సాయంకాల షోడశోపచార సహితంగా వేయి నామాలతో గణపతిని పూజించి మోదక, గుడ(బెల్లం) నివేదనల్తో పాటు ముఖ్యంగా 21 సంఖ్యలో ఉండ్రాళ్లు నివేదించాలి.
- వినాయకుని పూజించేటప్పుడు బిల్వ పత్రాలు తెల్లజిల్లేడు పువ్వులు, గరికపోచలు శ్రేష్టం.
- సంవత్సరం పూర్తియన తర్వాత వాయనదానం, ఉద్యాపన ముఖ్యం.
- యథాశక్తి లేదా 108 సార్లు ఓం గణపతియే నమః అనే అష్టాక్షరీ మంత్రజపం పూజ సమయంలో విశేషఫలదాయకం.
సంకల్పం: మమ సకుటుంబస్య ఇహజన్మని జన్మాంతరే చసంభూతానాం దురితానం క్షయ ద్వారా- శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అపిచ మమ విద్యా పుత్ర పౌత్ర ప్రాప్య్తర్థం – సకల దురిత సంకష్ట నివారణ సిద్ధర్యం శ్రీ గణపతి దేవతా ప్రత్యర్థం సంకష్ట హర చతుర్థీ వ్రత మహం కరిష్యే అని ప్రారంభించాలి.