Samantha Hollywood Entry దక్షిణాది నటి, అక్కినేని వంశం మాజీ కోడలు ప్రముఖ హీరోయిన్ సమంత పై గత కొద్ది గంటలుగా సోషల్‌మీడియాలో ఓ వార్త షేక్ అవుతోంది. అదేమిటంటే హాలీవుడ్‌లోకి సమంత అడుగు పెడుతుందట. ఈ సినిమా తనకు మొదటి సినిమా అని నెట్టింట్లో షేర్ చేసింది. సినిమా అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం కథ ఆధారంగా తెరకెక్కుతున్న(Arrangements of Love) ఇంగ్లీష్ సినిమా అంట. ఈ సినిమాలో సమంత(Samantha Hollywood Entry) మెయిన్ లీడ్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నవల ఇండియన్ రైటర్ టైమెరి ఎన్.మురారి(N.Murari) రాసిన ఈ నవల 2004లో అత్యధికంగా అమ్ముడైందంట.
సమంత కు ఇది ఒక క్రేజీ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఇంగ్లీష్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ (Philip John Director)కొత్త సినిమా కోసం ఎదురు చూస్తుండగా సామ్‌ను ఎంపిక చేశారంట. ఈ విషయాన్ని తనే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో విడాకులు అనంతరం ఆమెపై ఎన్నో పుకార్లు షికార్లు నెట్టింట్లో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ తన కెరీర్ విషయంలో వెనుకడుగు వేయకుండా వేగాన్ని పెంచారనేది స్పష్టం అవుతుంది. వరుసగా వస్తున్న సినిమా ఆఫర్లతో దూసుకుపోతుందనేది టాక్.


ఈ హాలీవుడ్ సినిమాలో సమంత బై-సెక్కువల్(bi sexual) అమ్మాయిగా నటించబోతున్నారట. 27 ఏళ్ల బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా బోల్డ్ పాత్రలో నటించనున్నట్టు వినికిడి. అంటే పురుషులతో పాటు అమ్మాయిల ఆకర్షణకు లోనయ్యే పాత్ర అన్నమాట. అయితే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు, నటులు, ఇతర అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!