Samantha divorce rumours: రూమర్లకు చెక్ పెట్టిన యువ కపుల్స్!
టాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ కపూల్స్‌లలో అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఒకటి. వీరిద్దరి జోడీని అభిమానించేవారి సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొద్ది రోజులుగా వీరి వైవాహిక జీవితం గురించి అనేక రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయని, త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఇక ఈ మధ్య సమంత ఒంటరిగానే గోవా ట్రిప్ వెళ్లడం, సోషల్ మీడియా ఖాతా నుంచి అక్కినేని పేరును తొలగించడం, ఎమోషనల్ పోస్టులు చేయడం వంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయని చెప్పవచ్చు.

దీంతో నిజంగానే సామ్, చైతూ విడిపోతున్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడిచింది. తాజాగా ఈ రూమర్స్లకు లవ్ స్టోరీ ట్రైలర్ ఎండ్ కార్డ్ వేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్‌స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. తాజాగా సోమవారం లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
- Jajimogulali Song Lyrics | Rudrangi Movie
- Lut gaya lyrics | Jubin Nautiyal | Emraan Hashmi
- Pasoori Lyrics in English | Hindi
- shiv tandav lyrics in English
- Kesineni Nani: అర్జునుడిని ఇలా చూడటం బాధాకరం!