Salt Making: ఎంత పెద్ద ఆహారమైనా రుచి రావాలంటే ఉప్పు ఉండాల్సిదే. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఉప్పు మరి ఎక్కడ నుంచి వస్తుంది? అని అడిగితే సముద్రం నుంచి వస్తుందని మనం టక్కున సమాధానం చెబుతాం. కానీ ఆ సముద్రపు నీటి నుంచి ఉప్పు ఎలా తయారవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు.
Salt Making: ఉప్పు తయారీ అంతా సహజ పద్ధతిలోనే ఉంటుంది. సముద్రపు నీరు అందుబాటులో ఉంటే దానినే వాడతారు. లేదంటే సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న దగ్గర్లలో తక్కువ లోతులో నుంచి వచ్చే బోర్ల నీటిని వాడతారు. ముందుగా ఉప్పునీటిని ఒక పెద్ద మడిలోకి మళ్లిస్తారు. ఆ మడిని గంజేరు అని కూడా పిలుస్తారు. అక్కడ 6-7 రోజులు ఉంచిన తర్వాత ఆ నీటిని యడమడి అనే మడిలోకి మళ్లిస్తారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత పంట మడికి మళ్లిస్తారు. ఈ మడిలోనే ఉప్పు తయారవుతుంది.
గంజేరు, యడమడి, పంట మడి నుండి దాటి వచ్చి ఉప్పు తయారు అయ్యే సమయం దాదాపు 40 రోజులు పడుతుందని తయారీదారులు చెబుతున్నారు. అసలు మొట్టమొదటిగా మడిని లోతుగా కూలిమనుషులతో తొక్కిస్తారు. ఆ తర్వాత మడి బాగా బిగసాలని, తర్వాత మళ్లీ వాటర పెడతామని చెబుతున్నారు. తర్వాత దానిని మళ్లీ ఒకసారి తొక్కిస్తాం. ఆ తర్వాత దాని మీద ఇసుక పోస్తాం. దాని ద్వారా ఉప్పు వస్తుందని చెబు తున్నారు. కేవలం బోరు వాటర్ నుంచే సాల్ట్ తయారవుతుందని, దీనికి ఎలాంటి రసాయన పదార్థాలు వినియోగించమని తయారీదారులు చెబుతున్నారు.
వాతావరణం సహకరిస్తే ఎకరానికి 1000 బస్తాల ఉప్పు లభిస్తుందట. వర్షం ఆటంకం లేకుండా స్వచ్ఛమైన ఉప్పు తయారైతే దాన్ని వంటల్లో వాడుకునేందుకు అమ్మేందుకు మార్కెట్లకు తరలిస్తుంటారు. వంటలకు పనికిరాని ఉప్పును రొయ్యిల చెరువులకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం రొయ్యిల చెరువులు ఏర్పాటు చేయ డంలో ఎక్కువుగా ఉప్పు అవసరం అవుతుంది. దీంతో ఉప్పు తయారీ దారులకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఉప్పు తయారీదారులకు నష్టాలు తగ్గాయని చెబుతున్నారు. ఎకరం ఉప్పు మడి ద్వారా కనీసం 20 మందికి ఉపాధి దొరుకుతుందని మడి నిర్వాహకులు చెబుతున్నారు.

ఉప్పు తయారయ్యాక దానిని కొంత కాలం నిల్వ చేస్తారు. వర్షాకాలం ముందు ఉప్పును కుప్పగా పోసి దానిపైన తాటాకును కప్పుతారు. వర్షాలు తగ్గిన వెంటనే ఆ ఉప్పును ఎగుమతులకు సిద్దం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలకు ఉప్పు ఎగుమతి అవుతుందని ఉప్పు రైతులు చెబుతున్నారు. ఈ ఉప్పు తయారీలో భాగంగా వందల మంది దీనిపై జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు. ఉప్పు కూలీలకు చిన్న బస్తాకు అయితే రూ.5 , పెద్ద బస్తాలకు అయితే రూ.10 చొప్పున కూలి వస్తుందని కార్మికులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రతీరానికి ఆనుకొని ఉన్న అన్ని జిల్లాల్లో ఎంతో కొంత ఉప్పు తయారువుతుంది. ఇక ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ ఉప్పు తయారీ పెద్ద ఎత్తున సాగుతుంది. కాకినాడ, మచిలీపట్నం లో తీరప్రాంతాల్లో కూడా కొందరు ఉప్పు తయారీ చేస్తుంటారు. కొన్ని రసాయాలను వినియోగించడం ద్వారా పాకెట్లల్లో ఉండే పొడి ఉప్పును తయారు చేస్తారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి