Salaar Movie | ప్రభాస్(Prabhas)కు మరో బాహుబలి సినిమా లాంటి హిట్ పడాలని అభిమానులు ఆశిస్తున్నారట. అదే టార్గెట్‌గా చేసుకొని ప్రభాస్‌తో Prashanth Neel డైరెక్షన్లో సలార్ మూవీ వస్తోందట. సలార్(Salaar Movie) కచ్చితంగా బాహుబలి అంత హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే తాజాగా సలార్ మూవీ గురించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. యాక్షన్ థ్రిలర్లమూవీ సలార్ బాహుబలి సినిమాలాగా రెండు పార్టులు ఉంటాయని అనుకుంటున్నారు సినిమా ప్రేక్షకులు.
ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకులు, అభిమానుల ముందుకు వచ్చిన ప్రభాస్(Prabhas) కాస్త మరింత కిక్కును అందించేందుకు సలార్ మూవీ రెడీగా చేసి విడుదల చేసే సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఈ సారి ప్రభాస్ తన సత్తా ఏంటో మరోసారి సలార్ సినిమా ద్వారా చూపించనున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్ -2(KGF Chapter 2) తో ఇప్పటికే ప్రశాంత్ నీల్ రేంజ్ పెరిగిపోయింది. ఇక సలార్ తో ప్రభాస్ రేంజ్ కూడా రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడనేది టాక్.
ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఒకటి వస్తున్నట్టు తెలుస్తోంది. దానికి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టినట్టు సమాచారం. అయితే ఆ టైటిల్‌కు అంతగా అభిమానుల నుండి మంచి స్పందన రాకపోవడంతో, మారుతీ మరేదైనా టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో పడ్డారట. పాన్ ఇండియా మూవీ లెవల్లో తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠీ తదితర భాషల్లో రానున్న కొత్త చిత్రానికి ఒక మంచి యూనిక్ టైటిల్‌ను ఖరారు చేయనున్నారట దర్శకుడు మారుతి. మొత్తానికి ప్రభాస్ సలార్ మూవీతో దేశాన్ని కుదిపేస్తారని అంతా బలంగా నమ్ముతున్నారు.

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఇప్పుడు కేజీఎఫ్-2(KGF Chapter 2)తో పాటు సలార్ లాంటి భారీ ప్రాజెక్టులు తన గుప్పిట్లో ఉన్నాయి. కన్నడ హీరో రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి నటించిన కేజీఎఫ్-2 సినిమా కేజీఎఫ్ సీక్వెల్‌గా రాబోతుంది. అయితే కేజీఎఫ్(KGF) ఫస్ట్ పార్ట్ దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం అందుకోవడంతో ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు భారీ డిమాండ్ పెరిగిందట. ఇప్పటికే కేజీఎఫ్-2 షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సమ్మర్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. అయితే సలార్ ఇప్పుడు షూటింగ్లో నడుస్తుంది. ఇది కూడా 2 పార్టులు అనేది ఇప్పటికే చెప్పుకున్నాం. అయితే సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ కేజీఎఫ్-2 మాత్రం ఇప్పటికే మార్కెట్లో భారీ రేట్లకు అమ్ముడు పోయిందట.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!