Three Capitals: ‘స‌జ్జ‌ల’ నోట మూడు రాజ‌ధానుల మాట‌!

Three Capitals: ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన అనంత‌రం ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వివరాల‌ను తెలియ‌జేశారు. మూడు రాజ‌ధానులు, ప్ర‌త్యేక హోదాపై మాట్లాడారు.


Three Capitals : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికార వికేంద్ర‌కీర‌ణ జ‌ర‌గ‌బోతోంద‌ని, మూడు రాజ‌ధానులు ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు స‌హాయం చేయాల‌ని సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రాన్ని కోరిన‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం తో పాటు ప‌లు అభివృద్ధి అంశాల‌పై చ‌ర్చించార‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై కేంద్ర మంత్రుల‌తో సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా చ‌ర్చించిన‌ట్టు తెలిపారు.

ప్ర‌త్యేక హోదాపైనా చ‌ర్చ‌!

రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు, ఇళ్ళ నిర్మాణం, ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై సీఎం జ‌గ‌న్ చ‌ర్చించార‌ని స‌జ్జ‌ల తెలిపారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అంశాన్ని చంద్ర‌బాబు నీరుగార్చార‌ని, తాము ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న‌ట్టు పేర్కొన్నారు. కేసుల మాఫీ కోస‌మే సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లారంటూ టిడిపి నేత‌లు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. సీఎం జ‌గ‌న్ వ్య‌క్తిగ‌తం కాదని, రాష్ట్ర స‌మ‌స్య‌ల ప‌రిష్కార ల‌క్ష్యంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న సాగింద‌న్నారు. శాస‌న మండ‌లి ర‌ద్దు చేయాల‌ని ఇప్ప‌టికే తీర్మానం చేసి కేంద్రానికి పంపామ‌ని, శాస‌న మండ‌లి ర‌ద్దు అంశం కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉంద‌న్నారు. శాస‌న మండ‌లి ర‌ద్దు చేసినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు.

చ‌ద‌వండి :  Scheme : Sunna vaddi న‌గ‌దును జ‌మ‌చేసిన ఏపీ సీఎం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *