తెలంగాణ‌

saidabad rape case: దుండగుడిని కఠినంగా శిక్షించాలి:డివైఎఫ్ఐ

saidabad rape case

saidabad rape case రఘునాధపాలెం: హైదరాబాద్ లో 6 సంవ‌త్స‌రాల‌ చిన్నారి చైత్ర భాయ్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించి, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని టి.ఆర్.యస్ ప్రభుత్వాని డి. వై.యఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల. రమేష్ డిమాండ్ చేశాడు.స్థానిక చిమ్మపుడి గ్రామంలో యస్. యఫ్. ఐ, డి.వై. యఫ్.ఐ ఆధ్వర్యంలో చైత్ర భాయ్ కుటుంబానికి న్యాయం చేసి,నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు విద్యార్థులు, యువకులు ప్రదర్శన,నిరసన కార్యక్రమం బుధ‌వారం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో 6 సంవత్సరాల ఒక గిరిజన చిన్నారిపై మృగంలాగా అత్యాచారం చేసి,ఆపై హత్యచేయడం చాలా దుర్మార్గమైన చర్య అన్ని, ఈ ఘటనను అందరూ ముక్తకంటంతో ఖండించాలని ఆయన తెలిపారు. ఘటన జరిగి 6 రోజులు అవుతున్న పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిందితుడిని కూడా పట్టుకోలేకపోవడం దారుణమని,కనీసం చిన్నారి కుటుంబాన్నీ అధికార పార్టీ మంత్రులు,నాయకులు ఎవరు పరామర్శించకపోవడం సరైంది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే చిన్నారి చైత్ర భాయ్ పై అత్యాచారం చేసి, హత్య చేసిన దుండగుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని,చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యస్. యఫ్.ఐ గ్రామ అధ్యక్షుడు రాచ్చర్ల.నరేష్, డి. వై.యఫ్.ఐ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు దొంతూ. గణేష్, దశరద. వినోద్, డి. వై. యఫ్. ఐ మండల నాయకులు జోనెబోయిన.నవీన్, సచ్చు. దిలీప్, యస్. యఫ్. ఐ విద్యార్థినిలు రాచ్చర్ల.భవాని, దసరధ. అంజలి,చింతిరాల. శ్రావణి, షేక్.యస్మిన్,షేక్. జావిధ, రాచ్చర్ల.నందు, చింతల.గోపి, గాడిచర్ల. మధు తదితరులు పాల్గొన్నారు.

See also  Gampalagudem: Murder Case |మ‌ర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

Comment here