Sai DharamTejహైదరాబాద్: మెగా హీరో సాయి ధర్మతేజ్‌కు శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయి ధర్మతేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ (Sai DharamTej)అపస్మారక స్థితిలో వెళ్లినట్టు తెలుస్తోంది.
నగరంఓలని కేబుల్ బ్రిడ్జ్ – ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయి ధరమ్ తేజ్‌ను మెరుగైన వైద్యం కోసం అపోలోకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్టు మాదాపూర్ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్ తేజ్‌కు వైద్యులు స్కాన్ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు సీఐ వివరించారు.


ప్రమాద వార్త తెలుసుకున్న మెగస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్, తదితర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం స్పృహ వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!