sai baba message today: నాలుక, కోపం, కోరిక ఈ మూడింటినీ అదుపులో ఉంచుకోవాలి. గురువు, తల్లిదండ్రులు, దైవం ఈ ముగ్గురినీ గౌరవించాలి. పవిత్రత, నిజాయితీ, కఠోరశ్రమ ఈ మూడింటిని అలవర్చుకోవాలి. సోమరితనం, అబద్ధం, పరనింద ఈ మూడింటినీ విడిచిపెట్టాలి. ధైర్యం, కీర్తి, ప్రశాంతత ఈ మూడింటి కోసం పాటుపడాలి. వాగ్దానం, స్నేహం, వాత్సల్యం ఈ మూడింటినీ నిలబెట్టుకోవాలి. మాట, నడవడిక, పని ఈ మూడింటినీ నిరంతరం నేర్చుకోవాలి. సత్ప్రవర్తన, దానగుణం, సేవ ఈ మూడింటినీ నేర్చుకోవాలి. పెంచుకోవాలి. ఈర్ష్య, అహంకారం, ద్వేషం ఈ మూడింటిని లేకుండా చూసుకోవాలి.
sai baba message today: పరనింద మహా పాపం
ఎవరైనా పరనిందకు పాల్పిడే నన్ను బాధపెట్టిన వారవుతారు. నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా స్పందించకు. ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా!. ఎవరు చేసిన పాపానికి వారే ఫలితం అనుభవి స్తారు.నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవిస్తావు. ఇంకొకరు అనుభవించరు కదా! ఇదే అసలైన ఆనంద మార్గం.
నేనెప్పుడూ(sai baba message today) పైకం రూపంలో దక్షిణ కోరతానని అనుకోవద్దు. మీలోని మంచి-చెడు లక్షణాలను కూడా, నేను ఒక్కోసారి దక్షిణగా కోరుతుంటాను. మీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించండి. ఆశలు లేని జీవితం, నిర్భయత్వం, నిత్య కృషితో జీవించడం, అందరిపై ప్రేమతో ఉండటం, జ్ఞానం, ఏకాగ్రత, కర్తవ్యం, సదా ప్రసన్నంగా ఉండటం, ధైర్యం, సర్వ భూతదయ, ఉత్తమ బుద్ధి, సంతుష్టి, మృదుత్వం, మృదు భాషణం ఈ లక్షణాలను పెంచుకోండి. వాటిలో కొంత నాకు దక్షిణ సమర్పించండి.
నాది మతమని చెప్పలేదు. మార్గమే చూపాను. నేనే సత్యమని అనలేదు. తత్వమే చెప్పాను. ఉపదేశాలెందుకన్నాను. ఉపవాసాలుండొద్దన్నాను. నీవే బ్రహ్మమని తెలుసుకోమన్నాను. దేహభ్రమను వీడమన్నాను. గతజన్మ బంధమున్నందుకే నిన్ను నా గడప(sai baba message today)ను తొక్కనిచ్చాను. నా భక్తునివి కమ్మని నిను బతిమిలాడితినా ఏమి?.
నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం, రూపం లేదు. నేనెల్లప్పుడూ అంతటా ఉంటాను. నాపై భారం వేసి, నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను. ఒక్క విషయం గుర్తు ఉంచుకోండి. ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకోండి. అంతా నేనే చూసుకుంటాను. బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాది. మనసుతో కానీ, నోటితో కానీ మరియు చేతలతో కానీ ఎవర్నీ నొప్పించకు. అందరిపై దయకల్గి ఉండు, నీకు సుఖశాంతులు కావాలంటే ఏవిధమైన పాపాలు చేయకు. నిన్ను ఎవ్వరితో పోల్చుకోకు. ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు. ఇది మర్చిపోవద్దు. ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించు.
sai baba message today: సాయి బాబా ఏకాదశ సూత్రాలు
- షిర్డీ ప్రవేశమే సర్వదుఖః పరిహారము
- అర్హులైననేమి నిరుపేదలైన నేమి ద్వారకామయ ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు బొందగలరు.
- ఈ భౌతిక దేహంనంతరము నేనప్రమతుడను.
- నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండి యే నేను వెలువడుచుండును.
- నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును
- నన్నాశ్రయించిన వారిని శరణు చొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము
- నాయందుఎవరికీ ద్రుష్టియో వారి యందే నా కటాక్షము.
- మీ భారములు నాపై బడవేయుడు. నేను మోసెదను.
- నా సహాయమును కానీ, నా సలహాను గాని గోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
- నా భక్తుల ఇంట లేమి అను శబ్ధము పొడచూపదు.
- నా సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.