safety rules on roads పెరుగుతోన్న ట్రాఫిక్ చిక్కులను తప్పించుకోవడానికి ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్న అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతోంది. అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలూ పెరుగుతున్నాయి. కాబట్టి రయ్‌మని రోడ్డుపై దూసుకెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ముందుగా హ్యాండ్ బ్యాగ్‌లను భుజానికి తగిలించుకునే కొంతమంది వాహనాన్ని నడుపుతుంటారు. అది కాస్త కిందకు జారితే.. సర్దుకునే, పట్టుకునే ప్రయత్నంలో బండి అదుపు తప్పే ప్రమాదం ఉంది. అంత ఇబ్బంది పడకుండా డిక్కీలో బ్యాగు పెట్టాకే బండి నడపడం మొదలు పెట్టండి. కొందరు ఆకతాయిలు కావాలని పక్కనుంచి గట్టిగా హారన్ కొడతారు. ఇలాంటి పరిణామాలకు ఉలిక్కిపడి అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే హెల్మెట్ ధరించడం తప్పనిసరి. వెనుక వచ్చే వాహనాలను చూసేలా అద్దం (safety rules on roads)ఉండటమూ అవసరమే.

వర్షాకాలంలో పూర్తిగా చివర్లో కాకుండా కాస్త రోడ్డు మధ్య నుంచే బండి నడపాలి. చివరి నుంచయితే గుంతలూ, మ్యాన్హోళ్లూ ఎక్కడున్నాయి.. రోడ్డెక్కడ తెగిపోయింది అన్నది నీటి కారణంగా గమనించలేం. మధ్యలో నీటి నిల్వ తక్కువుగా ఉంటుంది కాబట్టి ప్రమాదాలకు కాస్త దూరంగా ఉండొచ్చు. అమ్మాయిలు సరిగ్గా బండి నడపలేరు అనే మాటను చాలాసార్లు మీరు విని ఉండొచ్చు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. దాన్ని మనసులో పెట్టుకుంటే వాహనం ఎక్కిన ప్రతిసారీ చేతులు వణకడం ఖాయం. రోడ్డంతా ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఓ మూల నుంచి నెమ్మదిగా వెళ్తే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అందరి మధ్యలో తగిన వేగంతో వాహనం నడపడం అలవాటు చేసుకుంటే, భయాలు తొలగిపోయి స్వేచ్ఛగా నడపగలుగుతారు.
మహిళా భద్రతకు కొన్ని సూచనలు(Women Saftey Tips)
మనకోసం మనమేం చేయాలో ఆలోచించుకోవాలి. ఇది మన బాధ్యత కూడా. అందుకే మనకోసం మనం జాగ్రత్తగా ఉందాం. స్నేహ్నాలు మంచివే. కానీ మగ స్నేహాల విషయంలో జాగ్రత్త తప్పదు. అందరూ చెడ్డవాళ్లే ఉంటారని కాదు. మనం మంచివాళ్లమనుకునే వారిలో మేకవన్నె పులులు ఉండరని అనుకోలేం. అందుకే.. స్నేహంలో కూడా కొన్ని పరిమితులు పాటించడం క్షేమం. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉందాం. మన వ్యక్తిగత వివరాలను వాటిలో పెట్టడం, ఫోన్ నెంబర్లు వంటివి షేర్ చేయడం మానేద్ధాం. చెడు ఆలోచనలు మనకు లేకపోవచ్చు. వేరేవారికి రావని చెప్పలేం కదా!.

లౌక్యం నేర్చుకుందాం. అర్జంటుగా ఫోన్ చేసుకోవాలి. ఒక సారి ఫోన్ ఇవ్వండి అని అంటారు. ఇచ్చేస్తాం. మన నెంబర్ సేవ్ చేసుకుని వేధిస్తారు. ఎవరో కొత్తవాళ్లు ఏదో పనుండి వచ్చినట్టు వస్తారు. ఇంట్లోకి పిలిచి మరీ మాట్లాడతాం. ఆ తర్వాత లేనిపోని కష్టాలు మొదలవుతాయి. సాయం చేయవద్దని కాదు. ప్రమాదాన్ని ముందే ఊహించి మరీ సాయం చేయడం మంచింది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి