Sadhana Shivdasani | హమ్ దోనో, లవ్ ఇన్ సిమ్లా, వక్త్ లాంటి చిత్రాలతో బాలీవుడ్(bollywood)లో మేటి నటిగా పేరొందిన ప్రముఖ నటి సాధన శివదాసాని (74) ఇండియా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1960-70 సంవత్సర కాలంలో భారీ పారితోషికం అందుకున్న కథానాయకల్లో సాధన ఒకరు. కెరీర్లో చేసినవి 34 సినిమాలే అయినా నాటి అగ్ర హీరోలందరి సరసన నటించారు సాధన.
1941 సెప్టెంబర్ 2న అవిభక్త భారతదేశంలోని కరాచీలో ఓ సింధు కుటుంబంలో సాధన(Sadhana Shivdasani) జన్మించారు. దేశ విభజన సమయంలో సాధన కుటుంబం ముంబై వచ్చి స్థిర పడింది. తొలిసారి శ్రీ 420 లో, ముర్ ముర్ కె న దేఖ్ ముర్ ముర్ కే.. పాటలో కనిపించారు సాధన. ఆ తర్వాత అబానా అనే సింధి సినిమాతో నటిగా అరగేట్రం చేశారు. అలా మొదలైన సాధన సినీ ప్రస్థానంలో ఏక్ ముసఫిర్ ఏక్ హసీనా , మేరా సాయా, అస్లీ నక్లీ , మేరే మెహబూబ్, వో కౌన్ థీ లాంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. జాయ్ ముఖర్జీ, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, మనోజ్ కుమార్, దేవ్ ఆనంద్ లాంటి అగ్ర కథానాయకులతో అనేక హిట్ సినిమాలు చేశారు సాధన.
నటనతో ఆమె ఎంతగా ఆకట్టుకున్నారో తలకట్టుతో అంతకుమించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సాధన. సాధన కట్ అని పిలుచుకునే ఓ వైవిధ్యమైన తలకట్టు ఆ రోజుల్లో ట్రెండ్‌గా మారింది. ఆమె నటన, నడవడిక చూసి అందరూ మిస్టరీ గర్ల్(mystery girl) అని పిలిచేవారు. ఆమెతో లవ్ ఇన్ సిమ్లా తీసిన ఆర్.కె.నయ్యర్ ను ఆ తర్వాత సాధన వివాహం చేసుకున్నారు. సహాయ నటి పాత్రలు చేయడానికి నిరాకరించిన సాధన 40 ఏళ్ల క్రితమే సినిమాల నుంచి దూరమయ్యారు. వో కౌన్ థీ, వక్త్ చిత్రాలకు ఫిలింఫేర్ నామినేషన్లు పొందిన సాధన 2002 లో ఐఫా నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. చివరకు అనారోగ్యంతో 74 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ