sad love

sad love: ప్రియురాలు లేని బ్ర‌తుకు నాకు ఎందుకు?

Spread the love

sad love: పీలేరు: ప్రియురాలు లేని బ‌తుకెందుకంటూ ఓ యువ‌కుడు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న పీలేరులో వెలుగు చూసింది. గురువారం స్థానిక క‌డ‌ప రోడ్డులో చోటు చేసుకున్న ఈ విషాద సంఘ‌ట‌నా వివ‌రాలు పోలీసుల క‌థ‌నం మేర‌కు ఇలా ఉన్నాయి. రొంపిచ‌ర్ల మండ‌లం గానుగ‌చింత‌కు చెందిన పి.శివ‌శంక‌ర్ (25) బెంగ‌ళూరులో సాప్ట్‌వేర్ ఇంజ‌నీరుగా ప‌నిచేస్తున్నాడు. గానుగ‌చింత పంచాయ‌తీ, లోకావారిప‌ల్లికి చెందిన అబ్బు నాయ‌క్ కుమార్తె శిల్ప‌, శివ‌శంక‌ర్ ప‌ర‌స్ప‌రం ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవ‌డానికి కూడా సిద్ధ‌మ‌య్యారు.

అయితే వారి పెళ్లికి కులం అడ్డొచ్చి పెద్ద‌లు అంగీక‌రించ‌లేదు. దీంతో 5 నెల‌ల క్రితం శిల్ప ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్రియురాలి ఆత్మ‌హ‌త్య‌తో శివ‌శంక‌ర్ మ‌న‌స్తాపానికి లోన‌య్యాడు. పీలేరు – క‌డ‌ప మార్గంలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం స‌మీపంలో ఓ చింత‌చెట్టుకు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య కు పాల్ప‌డ్డాడు. త‌న ఆత్మ‌హ‌త్య‌కు ఎవ‌రూ కార‌ణం కాద‌ని, తాను ప్రేమించిన శిల్ప లేని జీవితం త‌న‌కు వ‌ద్ద‌నే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు ఉత్త‌రం రాసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని, మృత‌దేహాన్ని శ‌వ‌ప‌రీక్ష నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి మృతుడి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు.

Telugu Love Story | Love Stories in Telugu | చిగురించిన ప్రేమ చివ‌రికి ఏమైంది?ల‌వ్ స్టోరీ

Telugu Love Story | Love Stories in Telugu | చిగురించిన ప్రేమ చివ‌రికి ఏమైంది?ల‌వ్ స్టోరీlatest telugu love storys"జీవిత... నీ కోసం వెత‌క‌ని Read more

chittoor(Adavi Buduguru): చావు కంటే ముందే అంత్య‌క్రియ‌లు ఏర్పాటు చేసుకున్న వ్య‌క్తి చివ‌ర‌కు?

chittoor(Adavi Buduguru) చిత్తూరు: కొంత మంది ఆత్మ‌హ‌త్య‌లు చాలా బాధ‌ను క‌లిగిస్తాయి. కొంత మంది ఆత్మ‌హ‌త్య‌లు మ‌న‌సును తాకుతాయి. అయ్యో! ఎంత క‌ష్టం వ‌చ్చిందో పాపం..అనే విధంగా Read more

Road accident madanapalle: విషాదం:రోడ్డు ప్ర‌మాదంలో విలేఖ‌రి మృతి

Road accident madanapalle మ‌ద‌న‌ప‌ల్లె: రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ విలేఖ‌రి మృతి చెందిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె మండ‌లంలో బుధ‌వారం చోటు చేసుకుంది. మదనపల్లె Read more

TTD Fake Webistes: టిటిడి టిక్కెట్లు అమ్మే ఫేక్ వెబ్‌సైట్ల‌పై పోలీసుల కొరఢా!

TTD Fake Webistes చిత్తూరు: పోలీసుల దృష్టి వెంక‌న్న స్వామి భ‌క్తుల ప‌రిర‌క్ష‌ణ‌పై పడింది. ఫ‌లితంగా తిరుమ‌ల స్వామివారి ద‌ర్శ‌నానికి టికెట్ల‌ను అమ్ముతాం అంటున్న 39 ఫేక్ Read more

Leave a Comment

Your email address will not be published.